మధురలో నామినేషన్ వేసిన హేమమాలిని.. ఆమె ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని ఉత్తరప్రదేశ్‌లోని మధుర లోక్‌సభ నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు.

Hema Malini Assets: సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని మరోసారి ఉత్తరప్రదేశ్‌లోని మధుర నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తున్నారు. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఆమె భావిస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో మధుర నియోజకవర్గం నుంచి హేమమాలిని గెలిచారు. తాజాగా ఎన్నికల్లో పోటీకి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆస్తుల విలువ సుమారు రూ.123 కోట్లు కాగా, అప్పులు రూ. 1.4 కోట్లు. తనపై ఎటువంటి క్రిమినల్ కేసులు పెండింగ్‌లో లేవని వెల్లడించారు.

హేమమాలిని వద్ద రూ.13.5 లక్షల నగదు, ఆమె భర్త ధర్మేంద్ర డియోల్ చేతిలో 43 లక్షల రూపాయల నగదు ఉంది. Mercedes-Benz, Alcazar, Maruti EECOతో సహా 61 లక్షల విలువైన వాహనాలు హేమమాలిని వద్ద ఉన్నాయి. ధర్మేంద్ర డియోల్ రేంజ్ రోవర్, మహీంద్రా బొలెరో, ఒక మోటార్ సైకిల్‌ను కలిగి ఉన్నారు. ఉదయపూర్ సర్ పదంపట్ సింఘానియా విశ్వవిద్యాలయం నుంచి 2012లో గౌరవ PhD అందుకున్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి ఒక రోజు ముందు యమునా నది ఒడ్డున ఉన్న విశ్రమ్ ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. యమునా నదిని కాలుష్య కారకాల నుంచి కాపాడటానికి పాటుపడతానని ఆమె మద్దతుదారులతో అన్నారు.

Also Read: ఎక్కడ చదువుకుని వచ్చారంటూ.. అన్నామలై, కంగనా రనౌత్‌పై కేటీఆర్ సెటైర్లు

కాగా, మథురలో నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు నిన్నటితో ముగిసింది. ఏడు దశల లోక్‌సభ ఎన్నికల్లో రెండో విడతలో(ఏప్రిల్ 26) ఇక్కడ పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.

Also Read: కేజ్రీవాల్‌కి వ్యతిరేకంగా వాగ్మూలం ఇచ్చాక మోదీ ఫొటో పెట్టుకుని ఓటు అడుగుతున్నారు..