మాగుంట శ్రీనివాసులురెడ్డిపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తీవ్ర ఆరోపణలు

లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ప్రధాని ఎలా కలుస్తారు? మాగుంట టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేస్తున్నారు.. మోదీ ఫొటో పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు.

మాగుంట శ్రీనివాసులురెడ్డిపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తీవ్ర ఆరోపణలు

MP Sanjay Singh: ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్‌ను మోదీ సర్కారు అక్రమంగా ఇరికించిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. జైలు నుంచి విడుదల అనంతరం మొదటిసారిగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాగుంట శ్రీనివాసులురెడ్డి, మాగుంట రాఘవ రెడ్డిని ఒత్తిడి చేసి కేజ్రీవాల్‌కి వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇప్పించారని తెలిపారు. తండ్రి కొడుకులు మొదట ఇచ్చిన 9 వాంగ్మూలాలు కేజ్రీవాల్‌కి వ్యతిరేకంగా లేవు.. ఆ తరువాత కేజ్రీవాల్ పేరు చెప్పారని వెల్లడించారు. దీన్ని బట్టే కుట్ర అర్థమవుతోందని పేర్కొంటూ.. ప్రధాని మోదీతో మాగుంట శ్రీనివాసులు రెడ్డి దిగిన ఫొటో మీడియాకు చూపించారు సంజయ్ సింగ్.

సీఎం కేజ్రీవాల్‌కి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రను బయటపెడతామని, లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ప్రధాని ఎలా కలుస్తారని ప్రశ్నించారు. మాగుంట టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేస్తున్నారని, మోదీ ఫొటో పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని తెలిపారు. కేజ్రీవాల్‌కి వ్యతిరేకంగా వాగ్మూలం ఇచ్చాక మోదీ ఫొటో పెట్టుకుని శ్రీనివాసులు రెడ్డి ఓటు అడుగుతున్నారని అన్నారు.

”కేజ్రీవాల్‌కి వ్యతిరేకంగా ఈడీ వద్ద ఎటువంటి ఆధారాలు లేవు. 2022 నవంబర్ 9 వరకు కేజ్రీవాల్‌కి వ్యతిరేకంగా శరత్ చంద్రారెడ్డి మాట్లాడలేదు. 10 నవంబర్ 2022లో ఆయన అరెస్ట్ అయ్యారు. 2023 ఏప్రిల్ 25 వరకు శరత్ రెడ్డిని ఆరు నెలలు జైల్లో పెట్టారు. ఏప్రిల్ 25న కేజ్రీవాల్‌కి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చాక శరత్ రెడ్డికి బెయిల్ ఇచ్చారు. 10 వాంగ్మూలాలు కేజ్రీవాల్ వ్యతిరేకంగా శరత్ రెడ్డి మాట్లాడలేదు. ఈడీ విచారణ మొదలైన తరువాత లిక్కర్ కుంభకోణం మొదలైంది. 55 కోట్ల రూపాయల విరాళాలను శరత్ రెడ్డి బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎలక్టోరల్ బాండ్స్ వెలుగులోకి వచ్చాక శరత్ రెడ్డి విరాళాల అంశం బయట పడింది.

Also Read: టార్గెట్ రాహుల్ గాంధీ.. వయనాడ్‌లో హైవోల్డేజ్‌ ప్రచారానికి బీజేపీ ప్లాన్

లిక్కర్ కుంభకోణం బీజేపీ చేసింది. లిక్కర్ కుంభకోణంలో కేజ్రీవాల్‌ను ఇరికించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి వందశాతం నిజాయితీపరుడు. ఢిల్లీ విద్యార్థులకు మంచి విద్య అందించాలని కేజ్రీవాల్ తపించారు. ప్రజలకు నీళ్ళు అందించారు. ప్రపంచంలోనే మెరుగైన ప్రభుత్వ పాలన అందించారు. మనీష్ సిసోడియా కార్యదర్శి ఇచ్చిన వాంగ్మూలాలు అబద్దం కావచ్చు. కేజ్రీవాల్ ఏ పేపర్లు ఇస్తే ఆయన ఏ పేపర్లు అనుకున్నారో? గోవా ఎలక్షన్ అంటూ అబద్ధపు కథలు అల్లారు. బీజేపీ ఖాతాలను ఈడీ సీజ్ చేస్తుందనుకోవడం లేదు ఎందుకంటే..
55 కోట్లు బిజెపి ఖాతాలోకి వెళ్లాయని ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు.

Also Read: 48 పేజీలతో కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో విడుదల.. ఏమేం హామీలున్నాయో తెలుసా?