Hema Malini viral comment : రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ చూడలేదు…ఎంపీ హేమమాలిని సంచలన వ్యాఖ్యలు
రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ వ్యవహారంపై బీజేపీ పార్లమెంటు సభ్యురాలు, ప్రముఖ సినీనటి, డ్రీం గాళ్ హేమమాలిని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్లయింగ్ కిస్ వ్యవహారంపై ఫిర్యాదు చేసిన మహిళా ఎంపీల్లో సంతకం చేసిన హేమమాలిని ఆ తర్వాత దానికి విరుద్ధంగా మాట్లాడటం సోషల్ మీడియాలో వైరల్ అయింది....
- saleem sk
- Published On : August 10, 2023 / 04:07 AM IST
Hema Malini viral comment
Hema Malini viral comment : రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ వ్యవహారంపై బీజేపీ పార్లమెంటు సభ్యురాలు, ప్రముఖ సినీనటి, డ్రీం గాళ్ హేమమాలిని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ పార్లమెంటులో ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం తాను చూడలేదని హేమమాలిని పేర్కొన్నారు. ఫ్లయింగ్ కిస్ వ్యవహారంపై ఫిర్యాదు చేసిన మహిళా ఎంపీల్లో సంతకం చేసిన హేమమాలిని ఆ తర్వాత దానికి విరుద్ధంగా మాట్లాడటం సోషల్ మీడియాలో వైరల్ అయింది. (Hema Malini viral comment)
Rahul Gandhi: లంకను తగలబెట్టింది హనుమ కాదు.. రావణుడిని చంపింది రాముడు కాదు: రాహుల్
ఫ్లయింగ్ కిస్ వ్యవహారంలో రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్ర దాడి ప్రారంభించింది. రాహుల్ కేంద్రమంత్రి స్మృతి ఇరానీని ఉద్ధేశించి ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం మీరు చూశారా? అన్న ప్రశ్నకు హేమమాలిని తాను చూడలేదని చెప్పారు. (Didnot see Rahul Gandhi flying kiss) కానీ రాహుల్ మాటలు సరైనవి కాదని అన్నారు. రాహుల్ గాంధీపై మహిళా మంత్రి శోభా కరంద్లాజే, ఇతర పార్టీల మహిళా ఎంపీలు బుధవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు.
Roja: అటువంటి చిరంజీవి చెబితే మేము వినాలా?: రోజా కౌంటర్ మామూలుగా లేదుగా
రాహుల్ గాంధీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 21 మంది మహిళా బీజేపీ సభ్యుల సంతకాలతో కూడిన లేఖను స్పీకర్ ఛాంబర్‌లో శోభా కరంద్లాజే సమర్పించారు. స్పీకర్‌ను కలిసిన ప్రతినిధి బృందంలో ఎంపీ హేమమాలిని కూడా ఉన్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బుధవారం పార్లమెంట్‌లో తన తొలి ప్రసంగం ముగించుకుని వెళ్లిపోతుండగా బీజేపీ ఎంపీలపై ఫ్లయింగ్ కిస్ వదిలారు.
