Roja: అటువంటి చిరంజీవి చెబితే మేము వినాలా?: రోజా కౌంటర్ మామూలుగా లేదుగా

సినీ పరిశ్రమ పెద్దగా సొంత తమ్ముడికి చిరంజీవి బుద్ధి చెప్పాలని మంత్రి ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు.

Roja: అటువంటి చిరంజీవి చెబితే మేము వినాలా?: రోజా కౌంటర్ మామూలుగా లేదుగా

Roja - ChiranJeevi

Roja – ChiranJeevi: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సర్కారుపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఆర్కే రోజా కౌంటర్ ఇచ్చారు. తిరుపతి (Tirupati)లో రోజా బుధవారం మీడియాతో మాట్లాడారు.

కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరంజీవి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా గురించి ఎందుకు పోరాడలేదని రోజా నిలదీశారు. కాంగ్రెస్‌ పార్టీని ఎందుకు నిలదీయలేదని అడిగారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి చిరంజీవి లబ్ధి పొందారని ఆమె విమర్శించారు. ఏపీకి చిరంజీవి నష్టం చేశారని ప్రజలు గుర్తించారని చెప్పారు.

అటువంటి చిరంజీవి చెబితే వినే స్థాయిలో తాము లేమని రోజా అన్నారు. చంద్రబాబు నాయుడి నుంచి ప్యాకేజీ తీసుకుని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మాట్లాడుతున్నారని చెప్పారు. సినిమా వేదికలపై పవన్ మాత్రమే రాజకీయాలు మాట్లాడతారని అన్నారు. సినీ పరిశ్రమకు పెద్దగా సొంత తమ్ముడికి చిరంజీవి బుద్ధి చెప్పాలని అన్నారు.

సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడం సరికాదని రోజా చెప్పారు. చిరంజీవి సలహా ఇవ్వాలనుకుంటే మొదట పవన్ కల్యాణ్ కే ఇవ్వాలని అన్నారు. బ్రో సినిమాలో మంత్రి అంబటి రాంబాబు పాత్రను పెట్టి ఆయన అవమానించారని.. అందుకే అంబటి ప్రతిస్పందిస్తున్నారని అన్నారు.

Ambati Rambabu: పవన్ వదిలేశానని అంటుంటే.. మరి చిరంజీవికి ఎందుకు?