Ambati Rambabu: పవన్ వదిలేశానని అంటుంటే.. మరి చిరంజీవికి ఎందుకు?

పవన్ సొంత తమ్ముడే అయినప్పటికీ అన్నయ్య ధర్మం మాట్లాడాలని చెప్పారు.

Ambati Rambabu: పవన్ వదిలేశానని అంటుంటే.. మరి చిరంజీవికి ఎందుకు?

Ambati Rambabu

Ambati Rambabu – ChiranJeevi: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన బ్రో సినిమాలో తన పాత్ర ఎందుకు పెట్టారని అంబటి నిలదీశారు. అసలు సినిమాను వదిలేశానని పవన్ అంటున్నారని.. మరి దానిపై చిరంజీవికి ఎందుకని ప్రశ్నించారు. తాజాగా ఏపీ సర్కారుపై చిరు చేసిన వ్యాఖ్యలపై అంబటి ఇవాళ మీడియా సమావేశంలో స్పందించారు.

తన జోలికి వస్తే తాను ఊరుకోనని అంబటి రాంబాబు అన్నారు. పవన్ సొంత తమ్ముడే అయినప్పటికీ అన్నయ్య ధర్మం మాట్లాడాలని చెప్పారు. బ్రో సినిమాలో చెడు ఉద్దేశంతోనే తన పాత్ర పెట్టారని అన్నారు. తాను సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడడం లేదని, కేవలం బ్రో సినిమా గురించి మాత్రమే మాట్లాడుతున్నానని చెప్పారు. తనకు చాలా పనులు ఉన్నాయని అన్నారు.

సినిమాల గురించి తనకెందుకని నిలదీశారు. పవన్ కల్యాణ్ సినిమాలకు తీసుకునే రెమ్యునరేషన్ అఫిషియల్, అనఫిషియల్ గా ఎంతుంటుందని ప్రశ్నించారు. మెగాస్టార్ చిరంజీవి అంటే తమకు గౌరవం ఉందని, అయనంటే ప్రత్యేక అభిమానం ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

చిరంజీవి సామాన్య కుటుంబంలో, తమ కులంలో పుట్టారని అన్నారు. కాపులను చంద్రబాబు నాయుడు ఇబ్బందులు పెడితే చిరంజీవి కలిసి వచ్చారని అన్నారు. అందుకే ఆయనంటే తనకు అభిమానమని తెలిపారు. స్వయం కృషితో పైకి ఎదిగారని చెప్పారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సమక్షంలో పోలీసులపై హత్యాయత్నం జరిగిందని అన్నారు. ఒక కానిస్టేబుల్ కి రెండు కళ్లు పోయాయని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. చంద్రబాబు నాయుడు అధికారంలో లేకపోతే సమాజంలో హింస చెలరేగానికి కుట్రలు పన్నుతారని ఆరోపించారు.

ఆయన కుట్ర చేసినందుకే కేసు పెట్టారని, ఇందులో తప్పేంటని నిలదీశారు. దుష్ట శక్తుల్ని ఉక్కు పాదంతో అణిచివేయాల్సిందేనని చెప్పుకొచ్చారు. చంద్రబాబు గతంలో ఏపీకి సీబీఐ వద్దు అన్నారని, అటువంటి వ్యక్తి ఇప్పుడు తాజా ఘటనపై సీబీఐ విచారణ కావాలంటున్నారని చెప్పారు.
Chiranjeevi: చిరంజీవి అభిమానుల ఆందోళనలో తీవ్ర ఉద్రిక్తత.. పలువురి అరెస్టు.. వీడియోలు