Heroin Seized From Pakistani Boat: గుజరాత్‌లో పాకిస్థానీ బోటు నుంచి రూ.360 కోట్ల విలువైన హెరాయిన్‌ స్వాధీనం

ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ పోలీస్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సంయుక్త ఆపరేషన్‌లో గుజరాత్ తీరంలో పాకిస్తాన్ బోట్ నుండి రూ. 350 కోట్ల విలువైన 50 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు శనివారం అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేశారు.

Heroin Seized

Heroin Seized From Pakistani Boat: ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ పోలీస్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సంయుక్త ఆపరేషన్‌లో గుజరాత్ తీరంలో పాకిస్తాన్ బోట్ నుండి రూ. 350 కోట్ల విలువైన 50 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు శనివారం అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. తదుపరి విచారణకోసం బోట్, దానిలోని ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

GSLV Mark – 3 Experiment: 22న జీఎస్ఎల్‌వీ- మార్క్3 ప్రయోగం.. నింగిలోకి దూసుకెళ్లనున్న వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలు

శుక్రవారం రాత్రి కోస్ట్ గార్డ్ అంతర్జాతీయ సముద్ర సరిహద్దులో పెట్రోలింగ్ కోసం C-429, C-454 అనే రెండు ఇంటర్‌సెప్టర్ షిప్‌లతో గస్తీ నిర్వహిస్తోంది. అర్ధరాత్రి సమయంలో గుజరాత్‌లోని జఖౌ నుండి 40నాటికల్ మైళ్ల దూరంలో భారత భూభాగంలో ఐదు నాటికల్ మైళ్ల దూరంలో అనుమానాస్పదంగా కదులుతున్న పాకిస్థాన్ బోట్ గమనించినట్లు అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. బోట్ ను అడ్డుకొనే క్రమంలో పాకిస్తాన్ బోట్ లోని సిబ్బంది తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేశారని, కోస్ట్‌గార్డ్ నౌకలు పాకిస్థాన్ బోట్‌కు అడ్డుగా ఉంచి బలవంతంగా ఆపడం జరిగిందని అధికారులు తెలిపారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి

బోటులో లభించిన ఐదు గన్నీ బ్యాగుల్లో దాచిఉంచిన 50 కిలోల మాదక ద్రవ్యాలు హెరాయిన్‌గా అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాల మార్కెట్ విలువ రూ.350 కోట్లు ఉంటుందని అధికారులు ప్రకటనలో తెలిపారు. ఇదిలాఉంటే గత ఏడాది కాలంలో గుజరాత్‌లోని ఇండియన్ కోస్ట్‌గార్డ్, ఏటీఎస్ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో ఇది ఆరవది. అయితే, ఒక నెలలోపు ఇది రెండవ ఆపరేషన్ కావటం గమనార్హం. సెప్టెంబరు 14న పాకిస్థానీ బోటులో 40కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటనలో తెలిపారు.