×
Ad

U టైప్ దాడుల్లో మాస్టర్ మైండ్ హిడ్మా.. అసలు U టైప్ గెరిల్లా దాడి అంటే ఏంటి?

ఎడమ వైపు, కుడి వైపు, వెనుక వైపు మావోయిస్టులు ఉండి దాడి చేస్తారు. పోలీసులు ముందు వైపు కొండెక్కి పారిపోవడానికి టైం దొరకదు.

Hidma

Madavi Hidma: మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు నేత మడావి హిడ్మాతో పాటు అతడి భార్యను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలోని మారేడుమిల్లి అడవుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో వారు హతమయ్యారు.

గతంలో హిడ్మా ఎన్నో భీకరదాడులు చేసి, ఎంతో మంది జవాన్ల ప్రాణాలు తీశాడు. హిడ్మా భారీ గెరిల్లా దాడులకు వ్యూహాలు రచించేవాడు. అతడు చేసిన దాడుల్లో అధిక శాతం విజయవంతమయ్యాయి. హిడ్మా ఇండొనేషియాలోని గెరిల్లా దాడుల్లో ట్రైనింగ్ తీసుకుని వచ్చినట్టు గతంలో ప్రచారం జరిగింది. అతడు U టైప్ గెరిల్లా దాడిలో ఆరితేడాడు.

Also Read: హిడ్మా ఎవరు? ఈ భారీ గెరిల్లా దాడుల వ్యూహకర్తపై రూ.కోటి రివార్డు.. ఎన్ని భీకరదాడులు చేశాడో, ఎలా తప్పించుకునేవాడో తెలుసా?

U టైప్ అంటే ఏంటి?
భద్రతా బలగాలు వస్తున్నాయని ముందే సమాచారం వస్తుంది. ఆ భద్రతా బలగాలను రానివ్వకుండా మావోయిస్టులు అడ్డుకోరు. వాళ్లను లోనికి రానిస్తారు. చుట్టూ కొండలు ఉండి.. మధ్యలో లోతైన ప్రదేశం వరకు వాళ్లు వచ్చే వరకు వెయిట్ చేస్తారు.

ఆ తర్వాత మూడు వైపులా మావోయిస్టులు చుట్టేస్తారు. అనంతరం భద్రతా బలగాలపై కాల్పులు జరుపుతారు. ఎడమ వైపు, కుడి వైపు, వెనుక వైపు మావోయిస్టులు ఉండి దాడి చేస్తారు. పోలీసులు ముందు వైపు కొండెక్కి పారిపోవడానికి టైం దొరకదు.

ఇలాంటి సందర్భాల్లో భద్రతా బలగాల ప్రాణనష్టం అధికంగా ఉంటుంది. ఇలాంటి దాడులు చేయడంలో హిడ్మాకు సిద్ధహస్తుడిగా పేరుంది. 2021 ఛత్తీస్‌గఢ్‌లో జరిపిన మావోయిస్టు దాడిలో 24 మందికి పైగా జవాన్లు చనిపోయారు. ఈ దాడికి నేతృత్వం వహించింది కూడా హిడ్మానే.