ఢిల్లీ : పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆర్మీ సర్జికల్ దాడులతో విరుచుకుపడింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోడీ అత్యవసరంగా సమావేవమయ్యారు. పాక్ స్థావరాలపై మూడు ప్రాంతాలపై భారత వైమానిక దాడుల్లో 300 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్లుగా సమాచారం.
Read Also :భారత్ సర్జికల్ ఎటాక్స్ : ఒక్కరు కూడా చనిపోలేదన్న పాక్
ఈ క్రమంలో ప్రధాని అధ్యక్షతన అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, నిర్మలా సీతారామన్, అరుణ్ జైట్లీ సహా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్..ఇంకా ఇతర అధికారులు హాజరయ్యారు. మరోవైపు, వైమానిక దాడుల క్రమంలో భారత్ , పాకిస్థాన్ సరిహద్దుల్లోని అన్ని జిల్లాల్లోనూ హైఅలర్ట్ ప్రకటించారు. అలాగే గుజరాత్‌లోని జామ్‌నగర్, మాలియా, అహ్మదాబాద్, వడోదర వైమానిక స్థావరాల్లోను హైఅలర్ట్ ప్రకటించి, అవసరమైతే దాడులకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
Read Also : భారత్ సర్జికల్ ఎటాక్ : షేర్ మార్కెట్ ఢమాల్
పాక్ వైమానిక దళం దాడులకు పాల్పడే అవకాశం ఉందని, దీనిని సమర్ధంగా ఎదుర్కొడానికి సిద్ధంగా ఉండాలంటూ అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి రక్షణ వ్యవస్థలను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మరింత అప్రమత్తం చేసింది. ఐఏఎఫ్‌కి చెందిన ముందస్తు హెచ్చరికల విమానం ఈఎంబీ 145 సరిహద్దుల్లో మంగళవారం ఉదయం చక్కర్లు కొట్టినట్టు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్‌లో గుర్తించారు. ఇదిలా ఉండగా అటు పాక్ సైతం అప్రమత్తమైంది. అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులు, భద్రతపై సమీక్షకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
Read Also : టార్గెట్ ఫినిష్ : భారత్ బ్రహ్మాస్త్రం మిరాజ్ యుద్ధ విమానాలు