Bastar High Tension : భారీ ఎన్‌కౌంటర్.. బస్తర్ అడవుల్లో భయం భయం

కాల్పుల్లో మరణించిన మావోయిస్టుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Bastar High Tension : బస్తర్ లో టెన్షన్.. టెన్షన్.. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన. భారీ ఎన్ కౌంటర్ తర్వాత ఛత్తీస్ గఢ్ బస్తర్ అడవుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. టెన్షన్ సిట్యుయేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఇంకా కూంబింగ్ కొనసాగుతోంది. బస్తర్ అడవులను జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు. ఎన్ కౌంటర్ లో చనిపోయిన 29మంది నక్సలైట్ల మృతదేహాలకు కాంకేర్ లో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఎన్ కౌంటర్ సమయంలో 60మందికిపైగా నక్సల్స్ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు పోలీసులు. కాల్పుల్లో మరణించిన మావోయిస్టుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

డీఆర్జీ, బీఎస్ఎఫ్ జవాన్లు సంయుక్తంగా నక్సల్స్ ను చుట్టుముట్టడంతో ఎదురు కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. నాలుగు గంటల పాటు హోరాహోరీగా ఎదురు కాల్పులు జరిగాయని బస్తర్ ఐజీ చెప్పారు. ఎన్ కౌంటర్ లో ఏపీకి చెందిన అగ్రనేత చిన్నయ్య అలియాస్ శంకర్రావు ఉన్నారు. ఆయనపై 25లక్షల రివార్డ్ ఉంది. మృతుల్లో తెలంగాణ వాసులు ఉన్నట్లు గుర్తించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన సుధాకర్, ఆయన భార్య.. ఆదిలాబాద్ హత్నూర్ కి చెందిన సుమన్ అలియాస్ రజిత కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో 7 ఏకే 47లు ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఏడాదిలో ఇప్పటివరకు 4 నెలల వ్యవధిలో బస్తర్ రీజియన్ లో జరిగిన వేర్వేరు ఎన్ కౌంటర్ లలో 79మంది మావోయిస్టులు మరణించారు. గత ఐదేళ్లలో జరిగిన ఎన్ కౌంటర్ లలో ఇదే అతిపెద్దదిగా తెలుస్తోంది.

Also Read : రగులుతున్న పశ్చిమాసియా.. దాడితో రగిలిపోతున్న ఇజ్రాయెల్‌.. ఇరాన్‌కు వార్నింగ్

ట్రెండింగ్ వార్తలు