హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి విశాల్ నెహ్రికా విజయం సాధించాడు. బీజేపీ విజయంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మోడీ,అమిత్ షా నేతృత్వంలో బీజేపీకి తిరుగులేదు అంటూ కార్యకర్తలు బాణసంచా పేల్చుతూ మిఠాయిలు పంచుతున్నారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో సెటబ్రేషన్స్ లో పాల్గొన్నారు. సంతోషంలో స్టెప్పులేశారు.
మరోవైపు మహారాష్ట్రలో బీజేపీ మరోసారి ప్రభుత్వ ఏర్పాటు ఖాయమనే చెప్పవచ్చు. ఇప్పటివరకు బీజేపీ కూటమి 165స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా,కాంగ్రెస్ కూటమి 91స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మహరాష్ట్రలో కూడా బీజేపీ కార్యకర్తలు సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు. పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు.బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. అయితే హర్యనాలో మాత్రం కాంగ్రెస్-బీజేపీ మధ్య హోరాహోరి పోరు నడుస్తోంది. హంగ్ వచ్చే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు