CM Sukhvinder Singh
Himachal Pradesh CM Sukhvinder Singh Sukhu: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సమోసాల వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు ఇటీవల సీఐడీ కార్యాలయంకు వెళ్లారు. అక్కడ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. అయితే, సీఎం కోసం సమోసాలు, కేక్ లను తేవాలని ఉన్నతాధికారులు కింది స్థాయి అధికారులకు సూచించారు. వాటిని తీసుకొచ్చినప్పటికీ.. కింది స్థాయి అధికారులు సీఎం, ఉన్నతాధికారులకు వడ్డించాల్సిందే పోయి.. సీఎం సెక్యూరిటీ సిబ్బందికి వడ్డించారు. దీంతో సమావేశంలో పాల్గొన్న సీఎం, ఉన్నతాధికారులు కొద్దిసేపటి తరువాత అక్కడి నుంచి వెనుదిరిగారు. ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగిందనే విషయంపై సీఐడీ బాస్ విచారణకు ఆదేశించినట్లు తెలిసింది.
ఈ విషయం కాస్త బయటకు పొక్కడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సీఎంకు సమోసాలు అందలేదని విచారణకు ఆదేశించారంటూ విస్తృత ప్రచారం జరిగింది. బీజేపీ నేతలు సీఎం, ఉన్నతాధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించమని అధికారం ఇస్తే.. సమోసాల కోసం గోడవ ఏమిటని ప్రశ్నించారు. తాజాగా ఈ విషయంపై హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖ స్పందించారు. అలాంటిదేమీ లేదని వివరణ ఇచ్చారు. కేవలం ఇదంతా మీడియా సృష్టి మాత్రమేనని చెప్పుకొచ్చారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు అక్టోబర్ 21న సీఐడీ సైబర్ వింగ్ స్టేషన్ క్వార్టర్స్ ప్రారంభించడానికి వెళ్లారు. ఓ ఐజీ ర్యాంక్ అధికారి సీఎం కోసం సమోసాలు, కేకులు తెప్పించాలని ఎస్ఐని ఆదేశించారు. సదరు ఎస్ఐ ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ కలిసి వెళ్లి షిమ్లాలోని లక్కర్ బజార్ లో ఉన్న రాడిసన్ బ్లూ హోటల్ కు వెళ్లారు. మూడు బాక్సుల్లో సమోసాలు, కేకులు తీసుకొచ్చి వాటిని ఎంటీ విభాగానికి పంపించారు. అయితే, అవి సీఎం, ఉన్నతాధికారుల కోసమని చెప్పకపోవటంతో.. ఎవరికి పంపించాలనే సమాచారం లేక ఎంటీ విభాగం సిబ్బంది సీఎం భద్రతా సిబ్బందికి వడ్డించారు. మీటింగ్ లో ఉన్న సీఎంతో పాటు, సీఐడీ బాస్, ఇతర ఉన్నతాధికారులు ఆకలితోనే వెనుదిరిగారు. దీంతో సమోసాలు, కేకులు సీఎం ఉన్న మీటింగ్ సమావేశం హాల్ కు ఎందుకు రాలేదు.. సీఎం భద్రతా సిబ్బందికి ఎవరు ఇచ్చారనే విషయంపై సీఐడీ బాస్ విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. ఈ విచారణలో అధికారుల మధ్య సమన్వయ లోపం వల్లనే ఇలా జరిగిందని తేలింది. అయితే, ఈ విషయం బయటకు రావడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Delhi | On the ‘samosa’ controversy, Himachal Pradesh CM Sukhwinder Singh Sukhu says,”…There is no such thing..It (CID) got involved on the issue of misbehaviour, but you (the media) are running news about ‘samosa’…” pic.twitter.com/peoeKUdTX7
— ANI (@ANI) November 8, 2024