Himachal Govt : గంజాయి పంటకు చట్టబద్దం .. ఆదాయం పెంచుకునే యోచనలో ప్రభుత్వం

గంజాయి అక్రమ తరలింపులను ఎలాగు అరికట్టలేకపోతున్నాం..కాబట్టి గంజాయి పంట సాగును చట్టబద్దం చేసేస్తే పోలా అనే యోచనలో ఉంది ప్రభుత్వం.

Himachal govt legalise cannabis

Himachal Govt legalise cannabis : గంజాయి పండించినా తరలించినా నేరం. కానీ గంజాయి పంట పండించటానికి ప్రభుత్వమే అనుమతి ఇస్తే..ఇక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోచ్చు. భారత్ లోని కొన్ని రాష్ట్రాలోని కొన్ని ప్రాంతాల్లో గంజాయి సాగుకు అనుమతి ఉంది. నేరాలు ఎక్కువగా జరిగే ఉత్తరప్రదేశ్,రాజస్థాన్, మధ్యప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో గంజాయి పంట సాగుకు అనుమతి ఉంది. ఈక్రమంలో హిమాచల్ ప్రదేశ్ కూడా ఆ రాష్ట్రాల బాటలోనే నడవాలని యోచిస్తున్నట్లుగా ఉంది. గంజాయి అక్రమ తరలింపులను ఎలాగు అరికట్టలేకపోతున్నాం..కాబట్టి గంజాయి పంట సాగును చట్టబద్దం చేసేస్తే పోలా అనే యోచనలో ఉంది ప్రభుత్వం. దీని గురించి ప్రభుత్వం పరిశీలిస్తోంది.

గంజాయి సాగుకు చట్టబద్దం చేయటం గురించి సీఎం సుఖ్ వీందర్ సింగ్ సుఖు మాట్లాడుతూ.. గంజాయి సాగును చట్టబద్ధం చేయాలా? వద్దా? అనే విషయాన్ని నిపుణుల కమిటీ పరిశీలిస్తుందని తెలిపారు. దీని కోసం మా ప్రభుత్వం ఓ కమిటీని నియమించిందని..కమిటీ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఓ నిర్ణయానికి వచ్చాక దీని గురించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కేనాబిస్ ఆకులు, విత్తనాల వినియోగానికి సంబంధించిన సమాచారం ఆధారంగా మన చట్టం ఉంటుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో ఇప్పటికే దీని సాగును కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధం చేసింది అని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు.

గంజాయి సాగును రాష్ట్రంలో అనుమతించాలా? అన్నది హిమాచల్ ప్రదేశ్ పరిశీలించనుంది. చట్టప్రకారం నిషేధం ఉన్నా..అక్రమంగా సాగు అవుతునే ఉంది తరలింపులు జరుగుతునే ఉన్నాయి. దీంతో దీన్ని చట్టబద్ధం చేస్తే ఆదాయం పెంచుకోవచ్చు అని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది.