Kangana Ranaut : చిక్కుల్లో కంగ‌నా ర‌నౌత్‌..! హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు నోటీసులు.. ఎందుకంటే?

మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ ను 74వేలకుపైగా ఓట్ల తేడాతో కంగనా ఓడించారు.

Kangana Ranaut

Kangana Ranaut Election Challenged : హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఆమె చిక్కుల్లో పాడ్డారు. ఆమెకు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 21వ తేదీ లోగా సమాధానం ఇవ్వాలని జస్టిస్ జ్యోత్స్నా రేవాల్ కంగనాకు నోటీసులు ఇచ్చారు. హైకోర్టు నోటీసులు ఇవ్వడానికి ప్రధాన కారణం ఉంది. మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తాను దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను కావాలనే పక్కన పెట్టారని కిన్నౌర్ నివాసం లాయక్ రామ్ నేగి ఆరోపించారు. కంగనాను అనర్హులరాలిగా ప్రకటించాలని లాయక్ పిటీషన్ లో పేర్కొన్నారు.

Also Read : AP Cabinet : ఏపీ క్యాబినెట్ అత్యవసర సమావేశం.. ఏఏ అంశాలపై చర్చిస్తారంటే..

తాను గతంలో అటవీ విభాగంలో పనిచేశానని, ముందస్తుగానే ఉద్యోగ విరమణ చేసినట్లు నేగి తన పిటీషన్ లో పేర్కొన్నాడు. నామినేషన్ పత్రాలతోపాటే డిపార్ట్ మెంట్ నుంచి పొందిన నో డ్యూ సర్టిఫికెట్ ను జతచేసినట్లు తెలిపారు. అయితే.. విద్యుత్, తాగునీరు, టెలిఫోన్ విభాగాల నుంచి కూడా సర్టిఫికెట్లు తీసుకురావాలని రిటర్నింగ్ అధికారి ఆదేశించినట్లు తెలిపారు. అందుకు ఇచ్చిన ఒకరోజు గడువులోపు తాను అన్నీ తీసుకెళ్లి రిటర్నింగ్ అధికారికి ఇవ్వడం జరిగిందని, కానీ, అధికారులు వాటిని తీసుకోకపోగా.. తన నామినేషన్ తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారని పిటీషన్ లో లాయక్ రామ్ నేగి పిటీషన్ లో పేర్కొన్నాడు. నామినేషన్ పత్రాలు అంగీకరించి ఉంటే తాను అక్కడి నుంచి గెలిచేవాడినని రామ్ నేగి తన పిటీషన్ లో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ ఎన్నికను పక్కన పెట్టాలని లాయక్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. లాయక్ పిటీషన్ పై ఆగస్టు 21లోపు వివరణ ఇవ్వాలని కంగనాకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Also Read : వైసీపీకి షాక్ తప్పదా? పార్టీని వీడే ఆలోచనలో ఉన్న ఆ ఇద్దరు కీలక నేతలు?

మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ ను 74వేలకుపైగా ఓట్ల తేడాతో కంగనా ఓడించారు. కంగనా రనౌత్ కు 5.37లక్షల ఓట్లు రాగా.. విక్రమాదిత్య సింగ్ కు దాదాపు 4.62 లక్షల ఓట్లు వచ్చాయి.

 

ట్రెండింగ్ వార్తలు