Arvind Kejriwal: “హిమంత బాబు.. మా ఇంటికి వచ్చి టీ తాగి వెళ్లండి” అంటూ అసోం సీఎంకు కేజ్రీవాల్ ఆహ్వానం

అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తనపై చేసిన వ్యాఖ్యలకు కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. అసోంలో ఆతిథ్యం ఇవ్వకుండా బెదిరించాలని హిమంత చూస్తున్నారని, తాను మాత్రం అలా కాదని కేజ్రీవాల్ అన్నారు.

Arvind Kejriwal

Arvind Kejriwal: “హిమంత బాబు.. మా ఇంటికి వచ్చి టీ తాగి వెళ్లండి” అంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆహ్వానించారు. ఇవాళ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తో కలిసి కేజ్రీవాల్ అసోంలోని గువాహటికి వెళ్లారు. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. హిమంత బిశ్వ శర్మ ఢిల్లీకి వచ్చి తన ఇంట్లో టీ తాగాలని, అలాగే, ఆయనకు దేశ రాజధానికి దగ్గరుండి చూపిస్తానని కేజ్రీవాల్ చెప్పారు.

“నన్ను అసోంకి రావాలని హిమంత బిశ్వశర్మ ఎందుకు బెదిరిస్తున్నారు. నన్ను జైల్లో పెడతారా? నేను హిమంత బిశ్వశర్మకు ఓ విషయం సూచిస్తున్నాను. ఆయన అసోం సంస్కృతి, సంప్రదాయాలను సరిగ్గా అర్థం చేసుకోవాలి” అని కేజ్రీవాల్ అన్నారు. అసోం ప్రజలు హిమంత బిశ్వ శర్మలా వ్యవహరించబోరని, మంచి ఆతిథ్యాన్ని ఇస్తారని చెప్పారు. అతిథులను బెదిరించబోరని అన్నారు.

కాగా, కొన్ని రోజులుగా కేజ్రీవాల్ పై హిమంత బిశ్వశర్మ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తనపై కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసు ఏదైనా ఉంటే చూపించాలని కేజ్రీవాల్ కు హిమంత బిశ్వశర్మ సవాలు విసిరారు. అసోంకి వచ్చి తనపై అవినీతి ఆరోపణలు ఏవైనా చేస్తే కేజ్రీవాల్ పై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఆయన వ్యాఖ్యలపై కేజ్రీవాల్ స్పందించారు.

Revanth Reddy: వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల నాకు ఫోన్ చేశారు: రేవంత్ రెడ్డి