జ్ఞానవాపి మసీదు కింద భారీ హిందూ ఆలయం ఆనవాళ్లు.. ఏఎస్ఐ సంచలన నివేదిక

జనార్దన, రుద్ర, ఉమా మహేశ్వర పేర్లతో శాసనాలు దొరికాయన్నారు. 17వ శతాబ్దంలో ఆలయాన్ని కూల్చినట్లు నిర్ధారణ అయినట్లు తెలిపారు.

Gyanvapi mosque

Gyanvapi Case : జ్ఞానవాపి పైన ఏఎస్ఐ సర్వే రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. మసీదు కింద అతిపెద్ద ఆలయం ఆనవాళ్లు గుర్తించినట్లు నివేదికలో తెలిపారు. తెలుగు భాషతో పాటు 32 కీలక శాసన ఆధారాలు లభ్యమైనట్లు హిందువుల తరపు లాయర్ విష్ణు జైన్ తెలిపారు. జనార్దన, రుద్ర, ఉమా మహేశ్వర పేర్లతో శాసనాలు దొరికాయన్నారు. 17వ శతాబ్దంలో ఆలయాన్ని కూల్చినట్లు నిర్ధారణ అయినట్లు తెలిపారు. ఆలయ స్తంభాలతోనే ప్రస్తుత మసీదు నిర్మించారని ఏఎస్ఐ రిపోర్టులో ఉన్నట్లు స్పష్టం చేశారు.

 

ట్రెండింగ్ వార్తలు