Ram Mohan Naidu
విమానాల్లో బాంబులు పెట్టారంటూ నకిలీ ఫోన్స్ కాల్స్ చేసేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇవాళ తెలిపారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. అటువంటి కాల్స్ చేసి పట్టుబడిన వారిని నో ఫ్లై లిస్టులో పెడతామని చెప్పారు.
అలాగే, పౌర విమానయాన భద్రతా వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం 1982కి సవరణలు చేయడానికి కేంద్ర సర్కారు ప్రయత్నిస్తోందని అన్నారు. తాము నకిలీ బాంబ్ కాల్స్‌పై హోం మంత్రిత్వ శాఖ సహా ఇతర మంత్రిత్వ శాఖతోనూ సంప్రదింపులు జరుపుతున్నామని రామ్మోహన్ నాయుడు చెప్పారు.
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రయాణికుల భద్రత విషయంలో రాజీపడదని ఆయన అన్నారు. నకిలీ బెదిరింపులు వస్తున్నప్పటికీ తాము దానిని తేలికగా తీసుకోలేమని చెప్పారు. తమకు భద్రత విషయంలో ప్రోటోకాల్ ఉందని వివరించారు. బాంబు బెదిరింపుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో 10 శాతం భద్రతను పెంచినట్లు ఆయన తెలిపారు.
కేంద్ర సర్కారుతో పాటు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఇప్పటికే విమానయాన సంస్థలతో మాట్లాడుతున్నాయని ఆయన తెలిపారు. విమానయాన సంస్థల నుంచి సలహాలను కోరామన్నారు. కొన్ని వారాల నుంచి విమానయాన సంస్థలకు వరుసగా బాంబు బెదిరింపులు కాల్ప్ వస్తున్నాయి. అవన్నీ నకిలీ బెదిరింపులని తేలింది. బాంబు బెదిరింపు కాల్స్ విమానయాన కార్యకలాపాలకు ఆటంకాలు కలిగించాయి.
Viral Video: ఇంత చిన్న పాము ఎంత పెద్ద గుడ్డుని మింగిందో చూడండి..