Holi Celebration Inside Delhi Metro
ఢిల్లీ మెట్రో రైలులో మరో చిత్రవిచిత్ర ఘటన చోటుచేసుకుంది. మెట్రో రైళ్లలో కొందరు డ్యాన్సులు చేస్తూ ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించిన వీడియోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. ఇటువంటి పనులు మెట్రో రైళ్లలో చేయొద్దని అధికారులు వార్నింగ్ ఇస్తున్నప్పటికీ.. ట్రెండుకి తగ్గట్టుగా వీడియోలు తీసుకుంటూ వెనక్కి తగ్గకుండా పోస్ట్ చేస్తున్నారు కొందరు.
ప్రస్తుతం దేశం హోలీ జరుపుకునే మూడ్ లో ఉంది. ఈ ట్రెండ్ ను దృష్టిలో పెట్టుకుని ఇద్దరమ్మాయిలు మెట్రో రైల్ లో రంగులు పూసుకున్నారు. అక్కడితోనూ ఆగకుండా రైల్లోనే సన్నిహితంగా వ్యవహరిస్తూ వీడియో తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
వారు అనుచితంగా ప్రవర్తించిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇటువంటి వీడియోలు తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ కు ఫిర్యాదులు వస్తున్నాయి. ఆ ఇద్దరు అమ్మాయిలను వీడియోలో చూస్తేనే ఎంతో ఇబ్బందికరంగా ఉందని, ఇక రైల్లో ప్రత్యక్షంగా చూసిన వారికి ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఊహించుకోవచ్చని ఓ యూజర్ కామెంట్ చేశాడు.
We need a law against this asap pic.twitter.com/3qH1aom1Ml
— Madhur Singh (@ThePlacardGuy) March 23, 2024
Also Read: ఎమ్మెల్సీ కవిత కస్టడీ పొడిగింపు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు