Holi Festival : దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు.. గ్రాండ్‌‌గా సెలబ్రేట్

దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. జనం రంగుల వేడుకల్లో మునిగిపోయారు. కరోనా ఎఫెక్ట్‌తో రెండేళ్ల తర్వాత హోలీని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు...

Holi

Holi Festival : దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. జనం రంగుల వేడుకల్లో మునిగిపోయారు. కరోనా ఎఫెక్ట్‌తో రెండేళ్ల తర్వాత హోలీని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సందడి చేస్తున్నారు. హైదరాబాద్‌లో పలువురు మంత్రులు హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ఇందిరాపార్కు వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. స్థానికులు, కార్యకర్తలతో కలిసి రంగులు పూసుకున్నారు.

Read More : Holi 2022 : హోలీ ఆడుతున్నారా? మీ కళ్లు జాగ్రత్త.. ఈ చిట్కాలు పాటించండి..!

అనంతరం అందరితో కలిసి స్టెప్పులు వేసి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యూత్‌లో జోష్ నింపారు. ఇటు బోయిన్‌పల్లిలోని తన ఇంటి వద్ద హోలీ సంబరాలు జరుపుకున్నారు మంత్రి మల్లారెడ్డి. చిన్నారులు, కార్యకర్తలతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అమృత్‌సర్‌లో భారత జవాన్లు హోలీ పండుగ జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ తెగ ఎంజాయ్ చేశారు. ప్రతి ఒక్కరి జీవితాలు కూడా హోలీ పండుగలాగా కలర్‌ఫుల్‌ ఉండాలని జవాన్లు కోరారు.

Read More : Holi 2022 : హ్యాపీ హోలీ.. మీ ప్రియమైన వారికి వాట్సాప్ హోలీ స్టిక్కర్లను పంపుకోండిలా..!

బెజవాడలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు ఇంట్లో మాత్రం హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులు, బీజేపీ నేతలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు జీవీఎల్‌. నాలుగు రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగురవేయడంతో ఈ హోలీ తమకు చాలా స్పెషల్ అంటున్నారు జీవీఎల్. ఇదే ఉత్సాహంతో పనిచేసి 2024లో తెలుగు రాష్ట్రాల్లో పాగా వేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.