అకస్మాత్తుగా అర్థరాత్రి అస్వస్థత: మళ్లీ ఎయిమ్స్‌లో చేరిన హోంమంత్రి అమిత్ షా

  • Publish Date - September 13, 2020 / 05:54 AM IST

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో శనివారం(12 సెప్టెంబర్ 2020) అర్థరాత్రి ఎయిమ్స్‌లో చేరారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా అమిత్‌షా ఆసుపత్రిలో చేరారు. పల్మనరీ మరియు మెడిసిన్ విభాగానికి చెందిన సీనియర్ డాక్టర్లు ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆగస్టు 2వ తేదీన షా కరోనావైరస్ బారిన పడ్డాడు. అప్పుడు గురుగ్రామ్‌లోని మెదంతా ఆసుపత్రిలో చేరారు.

ఆగస్టు 14 న మెదంతా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత అమిత్ షా కు కరోనా నెగెటివ్ వచ్చింది. అప్పుడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మళ్లీ ఆగస్టు 18న, కరోనా నుంచి కోలుకున్న తరువాత, శ్వాస సమస్యలు, అలసట కారణంగా అతనిని ఎయిమ్స్‌లో చేర్చారు.

ఆగస్టు 31 న ఎయిమ్స్ నుంచి మళ్లీ డిశ్చార్జ్ అయ్యారు. ఆ సమయంలో, అమిత్ షా పూర్తిగా కోలుకున్నట్లు ఎయిమ్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. కానీ ఇప్పుడు అమిత్ షా మరోసారి ఆసుపత్రిలో చేరాడు. అమిత్ షా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండగా.. ఆయనను ఆసుపత్రిలో చేర్చినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అర్థరాత్రి అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారని వెంటనే ఆసుపత్రికి తీసుకుని వచ్చినట్లు చెబుతున్నారు.