జైట్లీ మృతితో ఢిల్లీ బయలుదేరిన అమిత్ షా

  • Publish Date - August 24, 2019 / 08:36 AM IST

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మృతితో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. హైదరాబాద్ లో నేషనల్ పోలీసు అకాడమీలో ఐపీఎస్ ప్రొబేషనర్ల పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమానికి షా హాజరయ్యారు. ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న జైట్లీ మృతిచెందారనే వార్త తెలియడంతో ఆయన హుటాహుటినా పర్యటన ముగించుకుని ఢిల్లీకి బయల్దేరి వెళ్లి నివాళి అర్పించనున్నారు.

‘జైట్లీ మరణం ఎంతో బాధించింది. వ్యక్తిగతంగా నాకెంతో నష్టం లాంటిది. ఒక సీనియర్ పార్టీ నేతను మాత్రమే కోల్పోలేదు.. ఎప్పటికీ నాకు మార్గదర్శిగా ఉండే ముఖ్యమైన కుటుంబ సభ్యునిగా కూడా కోల్పోయాను’ అని అమిత్ షా ట్వీట్ చేశారు. 

మరోవైపు జైట్లీ మృతిపై రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. జైట్లీ సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పటికే  ప్రధాని నరేంద్ర మోడీ, రాజ్ నాథ్ సింగ్ సహా ఇతర పార్టీల నేతలు కూడా సంతాపం ప్రకటించారు.  

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం ఎయిమ్స్ హాస్పిటల్ లో చికిత్స్ తీసుకుంటూ మృతి చెందారు.  ఈ విషయాన్ని ఎయిమ్స్ వర్గాలు ప్రకటించాయి. కొద్దిరోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 9వ తేదీన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆయన్ను ఎయిమ్స్‌కు తరలించారు.