ఉప్పల్ భగాయత్‌లో రెచ్చిపోతున్న పోకిరీలు.. ఏం జరిగిందో తెలుసా?

Uppal Bhagayat: ఓ జంట నుంచి పోకిరీలు మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు.

హైదరాబాద్ శివారులోని ఉప్పల్ భగాయత్ పోకిరీలు రెచ్చిపోతున్నారు. వారికి ఓ ఎస్సై కూడా తోడు కావడం గమనార్హం. రాత్రి వేళ భగాయత్‌కు వచ్చే జంటలను పోకిరీలు బెదిరిస్తున్నారు. జంటలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు.

ఓ జంట నుంచి పోకిరీలు మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోకిరీల ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. పోకిరీలతో చేతులు కలిపిన ఎస్సై.. రాజీపడాలని ఫిర్యాదుదారులకు సూచించారు. దీంతో బాధితులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.

పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సైను అధికారులు డీసీపీ ఆఫీస్‌కు అటాచ్ చేశారు. కాగా, ఉప్ప‌ల్ భ‌గాయ‌త్ లేఅవుట్‌లో దశవారీగా ప్లాట్ల అమ్మ‌కానికి నోటిఫికేష‌న్ జారీ అవుతున్న విషయం తెలిసిందే. ఇక్కడి ప్లాట్లు అధిక ధరలకు అమ్ముడుపోతుంటాయి. వాటిని చూసేందుకు చాలా మంది వస్తుంటారు.

Also Read: బుర్ఖాతో వచ్చి జ్యువెలరీ షాప్‌లో దోపిడీకి యత్నం కేసు.. నిందితుల అరెస్ట్.. వివరాలు తెలిపిన పోలీసులు

ట్రెండింగ్ వార్తలు