ఈ నిరసన అంతకుమించి : యువకులు For సేల్

తమ సమస్యసను ఎన్నిసార్లు పరిష్కరించమని వేడుకున్నా అధికారులు కనికరించకపోవడంతో యూపీ యువకులు తమ ఆందోళనను ప్రపంచమే గుర్తించేలా చేయనున్నారు. తమను తామే వేలంలో అమ్ముకోనున్నారు. ఓ సినిమాలో రైతులు తమ కష్టాల్సి తీర్చమని అధికారులను ప్రాయేధపడినా వారు పట్టించుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకొని దేశం మొత్తాన్ని తమ సమస్యలవైపు దృష్టిపెట్టేలా చేయడం మనం చూశాం. సరిగ్గా ఇదే విధంగా కొంచెం రూటు మార్చి అసలు తమను తామే అమ్మేసుకొని ఆ వచ్చిన డబ్బులతో తమ ప్రాంత ప్రజల సమస్యలను తీర్చాలని యూపీ యువకులు భావించారు. అంతేకాకుండా రిపబ్లిక్ డే రోజేనే నిరాహార దీక్ష చేయాలని యువకులు భావించారు.

ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ జిల్లాలోని మహో ప్రాంతంలో తీవ్రమైన తాగునీటి సమస్య ఉంది. తాగు నీరు లేక అనేక గ్రామాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. దాదాపు 3 లక్షలమందికి పైగా తాగునీరు లభించక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు పలుసార్లు మొరపెట్టుకొన్నారు. అయితే ఎన్ని సార్లు మొరపెట్టుకొన్నా అధికారులు పట్టించుకొన్న పాపాన పోలేదు. దీంతో విసుగుచెందిన 50 మంది ఆ ప్రాంత యువకులు తమ సమస్య తీరాలంటే ఒక్కటే మార్గం ఉందని భావించారు. యువజన్ కళ్యాణ్ సమితి పేరుతో ఓ క్యాంపెయిన్ ను ప్రారంభించారు. సభి కరిదార్ అమంత్రిత్ హై(బయ్యర్లు అందరూ ఆహ్వానితులే) అని ట్యాగ్ లైన్ తో క్యాంపెయిన్ లాంఛ్ చేశారు.

రిపబ్లిక్ డే రోజున తమను తాము వేలంపాట ద్వారా అమ్ముకొని వచ్చిన డబ్బులతో ఆ ప్రాంతంలో నీటి సమస్యను తీర్చాలని భావించారు. అంతేకాకుండా రిపబ్లిక్ డే రోజున నిరాహార దీక్ష కూడా చేయాలని భావించారు. 72 ఏళ్ల స్వాతంత్ర్యం తరువాత కూడా దేశంలో నీటి సమస్యలు ుండటం దురదృష్టకరమని, తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం నడిచే దుస్థితి తమకు ఏర్పడిందని, పాలకులకు ఓట్లు మాత్రమే ముఖ్యం తమ సమస్యలు పట్టించుకోవడం లేదని మహబత్తుర గ్రామ పెద్ద ప్రేమ్ పాల్ సింగ్ తెలిపారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలని ఆయన అన్నారు.