Haridwar
Haridwar : నేచర్ అద్భుతంగా ఉంటుంది. ఆకాశంలోని మేఘమాల మనసుకి ఉల్లాసంగా అనిపిస్తుంది. కానీ ఒక్కోసారి ఇదే నేచర్ భయాన్ని కలిగిస్తుంది. హరిద్వార్‌లోని ఆకాశాన్ని కమ్మేసుకున్న మేఘాలు చూస్తే వణుకు పుట్టేలా ఉన్నాయి. ‘షెల్ఫ్ క్లౌడ్స్’ గా పిలవబడే ఈ మేఘాలు దేనికి సంకేతమో తెలుసా?
Haridwar : తల్లిని, గంగాజలాన్ని కావడిపై మోస్తూ హరిద్వార్‌లో కనిపించిన వ్యక్తి వీడియో వైరల్
అద్భుతం అనాలా? భయంకరం అనాలా? హరిద్వార్‌లోని ఆకాశంలో మేఘాల్ని చూస్తే అదే డౌట్ వస్తుంది. షెల్ఫ్ క్లౌడ్ లేదా ఆర్కస్ క్లౌడ్‌గా చెప్పబడే ఈ మేఘాలు భయపెట్టే రూపంలో ఉంటాయి. చూడటానికి అలా ఉన్నా వాతావరణంలో వచ్చే మార్పుల్ని ఇవి సూచిస్తాయట. @Anindya_veyron అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. ‘ నా ఫ్రెండ్ ద్వారా షేర్ చేయబడిన వీడియో ఇది.. హరిద్వార్ దగ్గర దీనిని తీశారు. అద్భుతమైన షెల్ఫ్ మేఘం’ అనే శీర్షికతో ఈ పోస్టును షేర్ చేశాడు.
Jio True 5G Services : హరిద్వార్‌లో జియో ట్రూ 5G సర్వీసులు.. కొత్తగా 226 నగరాల్లో అందుబాటులోకి..!
ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ మేఘాల ప్రాముఖ్యత ఏంటి? అంటే వాతావరణంలో వచ్చే విపరీతమైన మార్పులకు ఇవి సూచికగా చెబుతారు. ఈ మేఘాలు కమ్మినపుడు ఒక్కోసారి ఈదురు గాలులు, భారీ వర్షం, మెరుపులు కొన్ని సందర్భాల్లో వడగళ్లు పడతాయట. ఒక్కోసారి ఉరుములతో కూడి తుఫానులను కూడా సూచిస్తాయట.
Shared by a friend. Shot today near Haridwar. Spectacular shelf cloud.
#Manali #Storm #Rain #thunderstorm #shelfcloud pic.twitter.com/he9KXg9qse
— Anindya Singh (@Anindya_veyron) July 9, 2023