Covid vaccineను ఎక్కడ నుంచి కొంటారు? ఇండియాలో ఎలా పంపిణీ చేస్తారు?

నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్ అధ్యక్షతన నిపుణుల కమిటీ అంతా సమావేశమైంది. కొవిడ్-19 వ్యాక్సిన్ ను ప్రజలకు ఎలా అందజేయాలా అనే దానిపై చర్చిస్తున్నారు. మంగళవారం ఉదయం రష్యా వ్యాక్సిన్ కు అప్రూవల్ ఇచ్చేస్తున్నట్లు ప్రకటించింది. కరోనావైరస్ తో పోరాడగల ఇమ్యూనిటీ ఇచ్చే ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్ అని ప్రకటించారు.

రష్యా ఆరోగ్య శాఖ.. బుధవారం 2వేల మందిపై క్లినికిల్ ట్రయల్స్ మొదలుపెట్టనున్నారు. ఇండియాలో వీకే పాల్ కమిటీ వ్యాక్సిన్ మ్యాన్యుఫ్యాక్చరర్స్, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి వ్యాక్సిన్ ను ప్రజలకు ఎలా పంపిణీ చేయాలా అనే దానిపై చర్చించనున్నారు.

‘వ్యాక్సిన్ తయారుచేయడానికి వనరులు, సరఫరా, సమానత్వం పాటిపస్తూ పంపిణీ చేయడం వంటి అంశాలపై చర్చిస్తాం. ఈ నిపుణుల బృందం అన్నీ రాష్ట్రాల వ్యాక్సిన్ మ్యాన్యుఫ్యాక్చరర్లతో దీనిపైనే మాట్లాడుతుంది’ అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సెక్రటరీ రాజేశ్ భూషణ్ మంగళవారం చెప్పారు.

ఇండియాలో డిఫరెంట్ స్టేజెస్ లో మూడు రకాల వ్యక్తులపై వ్యాక్సిన్ టెస్టులు జరుగుతున్నాయి.

భారత్ బయోటెక్ డెవలప్ చేసిన వ్యాక్సిన్ ను ఫేజ్-1, 2 మనుషులపై క్లినికల్ ట్రయల్స్ ఇద్దరిపైనే చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, జైడస్ కాడిలా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇది జరిగింది.

సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఫేజ్ 2, 3ల్లో హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ కు మాత్రమే పర్మిషన్ పొందగలిగింది. ఇది ముగ్గురిపై చేశారు. ఆస్ట్రాజెనెకా దీనిని తయారుచేసింది. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ప్రస్తుతం బ్రెజిల్ లో ఫేజ్-3 ట్రయల్ పూర్తి చేసుకుంటుంది.