Bihar Politics : బీహార్‌లో ఎవరి బలమెంత? ఆర్జేడీ నేతృత్వంలో మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఉందా?

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు బలంచేకూర్చుతూ ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ..

Lalu Prasad Yadav and Nitish Kumar

Nitish Kumar : బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీఎం నితీశ్ కుమార్ రాజీనామాతో మహాకూటమి ప్రభుత్వం కుప్పకూలిపోయింది. గవర్నర్ సూచనతో ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా నితీశ్ కొనసాగుతున్నాయి. అయితే, బీజేపీ, జేడీయూ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. సాయంత్రం కల్లా కొత్త ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉంది. మరోసారి సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, బీహార్ లో ఎన్ని పార్టీలు ఉన్నాయి? ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఉన్నాయి.. జేడీయూ- బీజేపీలు కలిసి ఎన్డీయే కూటమి కాకుండా.. ఆర్జేడీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయా? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

Also Read : Bihar Political Crisis : సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా.. మహాకూటమితో తెగతెంపులకు కారణం చెప్పిన నితీశ్..

బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 122 సీట్లు కావాల్సి ఉంటుంది. లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా ఉంది. ఆర్జేడీకి 79 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ 78 మంది ఎమ్మెల్యేలతో రెండో పెద్ద పార్టీగా కొనసాగుతుంది. నితీశ్ కుమార్ జేడీయూ పార్టీకి 45 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి 19 మంది, సీపీఐ(ఎం)ఎల్ పార్టీకి 12 మంది, హిందూస్థానీ ఆవామ్ మోర్చా పార్టీకి నలుగురు, సీపీఐ పార్టీకి ఇద్దరు, సీపీఎం పార్టీకి ఇద్దరు, ఎంఐఎం పార్టీకి ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. స్వతంత్ర ఎమ్మెల్యే ఒకరు ఉన్నారు. ఏడాదిన్నర క్రితం ఆర్జేడీ, జేడీయూ పార్టీలు మహాకూటమిగా ఏర్పడి నితీశ్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని కొనసాగించాయి. తాజాగా నితీశ్ కుమార్ మహాకూటమి నుంచి బయటకు రావడంతో పాటు బీజేపీతో జతకట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

Also Read : Jayadev Galla : టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కీలక నిర్ణయం.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడి

బీజేపీ, జేడీయూ కలిస్తే వారి కూటమికి 123 మంది ఎమ్మెల్యేల బలం ఉంటుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటుకు కావాల్సిన 122 మ్యాజిక్ ఫిగర్ దాటుతుంది. అంతేకాకుండా.. బీజేపీతోనే హిందూస్థానీ ఆవామ్ మోర్చా పార్టీ ఉంది. వారు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో బీజేపీ, జేడీయూ ప్రభుత్వం ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది. అయితే, ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆర్జేడీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే ప్రస్తుతానికి వారి బలం సరిపోదు. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో ఆ కూటమికి 114 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. ప్రభుత్వం ఏర్పాటుకు మరో ఎనిమిది ఎమ్మెల్యేలు అవసరం.

Also Read : ఓటమి ఖాయమని తెలిసిపోయింది, అందుకే జగన్ మాటల్లో తేడా కనిపిస్తోంది- చంద్రబాబు

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు బలంచేకూర్చుతూ ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. ఇప్పికే తాము కూడా సర్కార్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని సంకేతాలిచ్చారు. వచ్చే నెల బీహార్ లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో నూతన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టే యోచనలో లాలూ టీం ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు జేయూడీలో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలను తమవైపుకు లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మొత్తం 16 మంది జేడీయూ ఎమ్మెల్యేలు తమకు మద్దతుగా ఉన్నారని ఆర్జేడీ నేతలు పేర్కొంటున్నారు. నిజంగా వారు ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి వైపు మొగ్గితే బీహార్ లో బీజేపీ, జేడీయూ కూటమికి గట్టి షాక్ తగిలినట్లే. అయితే, అలా జరిగే అవకాశాలు లేవని జేడీయూ, బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. మరి.. రాబోయే రోజుల్లో బీహార్ రాజకీయాలు ఎలాంటి మలుపు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.

 

 

 

ట్రెండింగ్ వార్తలు