Security breach in Lok Sabha: పార్లమెంట్ దాడికి ఎలా ప్లాన్ చేశారు? ముందస్తు ప్లాన్ ప్రకారమే జరిగిందా?

సోషల్ మీడియాలో భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్‭తో సంబంధం ఉందని విచారణలో నిందితులు వెల్లడించారు. పార్లమెంటులో తనిఖీల సందర్భంగా బూట్లను క్షుణ్ణంగా తనిఖీ చేయడం లేదన్న లొసుగును బుధవారం దాడికి ఉపయోగించినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది

బుధవారం పార్లమెంట్ లోపల, బయట జరిగిన దాడి తాజాగా రాజకీయ రంగు పులుముకుంది. ఇది మీ పార్టీ నిర్వాకమంటే మీ పార్టీ నిర్వాకమంటూ ఒకరిమీదొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. పార్లమెంట్ మీద దాడి బీజేపీ ప్రభుత్వ వైఫల్యమని కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. కాగా, నిందితులలో ఒకరయిన నీలమ్.. కాంగ్రెస్ పార్టీ మద్దతురాలని, ఆమె గతంలో జరిగన రైతుల ఉద్యమంలో పాల్గొన్నదని బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు. ఆమె పార్లమెంట్ మీద దాడి కోసం మిగిలిన నిందితులను ప్రేరేపించిందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు.

ఇది కూడా చదవండి: కేటీఆర్‭కు పాలనానుభవం లేక అవాకులు పేలుతున్నారు.. మంత్రి పొన్నం

పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఒక ఉగ్రవాద కేసని, బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాను విచారించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. కాగా, ఈ ఘటనలోని నిందితులపై యూఏపీఏ నిబంధనల కింద ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కేసు నమోదు చేసింది. పెద్ద కుట్ర కోణంలో కేసును విచారిస్తున్నారు. పార్లమెంట్ పాసులు సంపాదించడంలో కీలక పాత్ర పోషించిన మైసూరుకు చెందిన మనోరంజన్ ను ఏ-1 గా విచారిస్తున్నారు. నిందితులను నేడు ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే దీనిపై అత్యున్నత స్థాయి విచారణకు కేంద్ర హోంశాఖ ఆదేశించింది. గత నాలుగు సంవత్సరాలుగా ఆరుగురు నిందితులు పార్లమెంట్ పై దాడి ప్రయత్నం చేస్తున్నారని, అతికష్టం మీద కొద్దిరోజల ముందు పథకం వేశారని పోలీసులు వెల్లడించారు.

పార్లమెంట్ పై దాడి ఎలా ప్లాన్ చేశారు?
భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్’ పేరుతో సోషల్ మీడియా గ్రూప్ ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా ద్వారా ఒకరికొకరు పరిచయమైన నిందితులు (నీలం ఆజాద్, ఆమోల్ షిండే, సాగర్ శర్మ, మనోరంజన్, విక్కీ శర్మ, లలిత్ ఝా)లు ఏడాదిన్నర క్రితం మైసూరులో ఒకసారి కలుసుకున్నారు. 9 నెలల క్రితం మరోసారి కలిశారు. జులైలోనే లక్నో నుంచి ఢిల్లీకి సాగర్ శర్మ వచ్చాడు. అప్పుడే పార్లమెంట్ సెక్యూరిటీ ఏర్పాట్లపై రెక్కీ నిర్వహించాడు. పార్లమెంట్‌లో పొగబాంబు దాడి కోసం నిందితులు ఆదివారం ఢిల్లీ చేరుకున్నారు.

ఇది కూడా చదవండి: పార్లమెంట్ దాడికి నెల నుంచి ప్రణాళిక.. నిందితులపై ఉపా కేసు

గురుగ్రాంలోని విక్కీ శర్మ నివాసంలో బస చేసి పథక రచన చేశారు. మహారాష్ట్రలోని తన స్వస్థలం నుంచి స్మోక్ క్యాన్లను ఆమోల్ షిండే తీసుకొచ్చారు. ఇండియా గేట్ వద్ద మీటింగ్ పెట్టుకుని స్మోక్ క్యాన్లను పంచుకున్నారు. మొత్తం ఆరుగురు పాసులు తీసుకుని లోపలికి వెళ్లాలని పథకం చేశారు. కానీ మనోరంజన్, సాగర్ శర్మకు మాత్రమే పాసులు లభించాయి. మనోరంజన్ కర్ణాటకు చెందిన వ్యక్తి కావడంతో బీజేపీ ఎంపీ ప్రతాప సింహా పీఏ ద్వారా పాసుల కోసం ప్రయత్నం చేశాడు. ఇది సక్సెసై మనోరంజన్‌తో పాటు సాగర్ శర్మకు కూడా పాస్ లభించింది.

ఇక లోపలికి వెళ్లిన సాగర్ శర్మ, మనోరంజన్.. లోక్‌సభ గ్యాలరీ నుంచి సభలోకి దూకి స్మోక్ క్యాన్లు (పొగబాంబులు) ప్రయోగించారు. ఇక పార్లమెంట్ కాంపౌండ్ వెలుపల నీలం, ఆమోల్ షిండే.. గేట్ వద్ద పొగబాంబు ప్రయోగించి నినాదాలు చేశారు. వాటిని మొబైల్ కెమేరాల్లో విక్కీ శర్మ, లలిత్ ఝా చిత్రీకరించారు. నీలం, ఆమోల్ షిండేను పోలీసులు పట్టుకోగానే విక్కీ శర్మ, లలిత్ ఝా పరారయ్యారు. అనంతరం విక్కీ శర్మను, అతని భార్యను గురుగ్రాంలో ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై UAPA (అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్)తో పాటు IPC (ఇండియన్ పీనల్ కోడ్) చట్టాల ప్రకారం కేసులు నమోదు చేశారు.

ఇది కూడా చదవండి: రాష్ట్రంలో అన్ని శాఖలను బీఆర్ఎస్ ఇలా మార్చేసింది: మంత్రి పొన్నం ప్రభాకర్

మనోరంజన్ తండ్రి తన కుమారుడి పాస్ కోసం గత కొద్ది రోజుల క్రితం తనను సంప్రదించాడని పోలీసుల విచారణలో మైసూరు ఎంపీ వెల్లడించారు. ఇక ఈ కేసు విచారణకు యాంటి టెర్రర్ ఆపరేషన్లను ఢీల్ చేసే ఢిల్లీ స్పెషల్ సెల్ నేతృత్వం వహిస్తోంది. అతిక్రమణ, నేరపూరిత కుట్ర, పార్లమెంట్ కార్యక్రమాలను అడ్డుకోవడం, అల్లర్లు సృష్టించాలనే ఉద్దేశంతో రెచ్చగొట్టడం వంటి కారణాల వల్ల కఠినమైన చట్టవిరుద్ద కార్యకలాపాల నివారణ చట్టం(యూఏపీఏ) వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

సోషల్ మీడియాలో భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్‭తో సంబంధం ఉందని విచారణలో నిందితులు వెల్లడించారు. పార్లమెంటులో తనిఖీల సందర్భంగా బూట్లను క్షుణ్ణంగా తనిఖీ చేయడం లేదన్న లొసుగును బుధవారం దాడికి ఉపయోగించినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. సీఆర్పీఎఫ్ డీజీ అనీష్ దయాళ్ సింగ్ నేతృత్వంలో విచారణ కమిటీని కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసింది.