Ponnam on KTR: కేటీఆర్కు పాలనానుభవం లేక అవాకులు పేలుతున్నారు.. మంత్రి పొన్నం
బుధవారం పార్లమెంట్ మీద జరిగిన దాడి గురించి పొన్నం స్పందిస్తూ.. పార్లమెంట్ పై దాడి బీజేపీ ప్రభుత్వ వైఫల్యమని అన్నారు. దానిపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ మీద మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు పాలనానుభవం లేక అవాకులు పేలుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి కనీసం వారం గడవకముందే పథకాలు అమలవ్వడం లేదని కేటీఆర్ మాట్లాడం సరికాదని అన్నారు. కాంగ్రెస్ ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేస్తోందని పొన్నం గుర్తు చేశారు. ప్రభుత్వం ఇప్పుడే ప్రారంభమైందని, రైతు పెట్టుబడి సాయం త్వరలోనే అందిస్తామని అన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తామని బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను ఎవరు పలికిస్తున్నారో కేసీఆర్, కేటీఆర్ చెప్పాలని అన్నారు. ఇక బుధవారం పార్లమెంట్ మీద జరిగిన దాడి గురించి పొన్నం స్పందిస్తూ.. పార్లమెంట్ పై దాడి బీజేపీ ప్రభుత్వ వైఫల్యమని అన్నారు. దానిపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.