సీఎం కీలక నిర్ణయం : హైదరాబాద్-కర్ణాటక పేరు మారింది
హైదరాబాద్-కర్ణాటక ప్రాంతం పేరు మారింది. ఇకపై కల్యాణ-కర్ణాటక అని పిలవాలి. ఈ మేరకు కర్ణాటక సీఎం యడియూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం(సెప్టెంబర్

హైదరాబాద్-కర్ణాటక ప్రాంతం పేరు మారింది. ఇకపై కల్యాణ-కర్ణాటక అని పిలవాలి. ఈ మేరకు కర్ణాటక సీఎం యడియూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం(సెప్టెంబర్
హైదరాబాద్-కర్ణాటక ప్రాంతం పేరు మారింది. ఇకపై కల్యాణ-కర్ణాటక అని పిలవాలి. ఈ మేరకు కర్ణాటక సీఎం యడియూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం(సెప్టెంబర్ 17,2019) కలబురగిలో మీడియాతో సీఎం యడియూరప్ప మాట్లాడారు. కల్యాణ-కర్ణాటక రీజియన్‌గా హైదరాబాద్-కర్ణాటక రీజియన్ పేరు మార్పు జరిగిందని చెప్పారు. ఇది కన్నడ ప్రజల చిరకాల డిమాండ్ అని సీఎం తెలిపారు. పేరు మార్పు అనంతరం కల్యాణ-కర్ణాటక ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక సచివాలయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్టు సీఎం యడియూరప్ప వెల్లడించారు.
కర్ణాటకలో హైదరాబాద్-కర్ణాటక ప్రాంతం కీలకమైనది. గుల్బర్గా, బీదర్, రాయచూరు, యాదగిరి, బళ్లారి, కొప్పళ జిల్లాలతో కూడిన ఈ ప్రాంతం.. హైదరాబాద్ కేంద్రంగా నిజాం రాజ్యంలో భాగంగా ఉండేది. దశాబ్దాలుగా ఈ ఆరు జిల్లాలను హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంగానే పిలుస్తున్నారు. హైదరాబాద్ విలీనం తర్వాత… కర్నాటకలోని ఈ ప్రాంతాన్ని హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంగా పిలిచారు. సీఎం నిర్ణయంతో మంగళవారంతో ఈ పేరు కనుమరుగైనట్టే. బీజేపీ అధికారంలోకి వచ్చాక పలు నగరాల పేర్లను మారుస్తున్న విషయం విదితమే.