బోరు బావి నుంచి బాలుడు క్షేమంగా రావాలి : రజనీ కాంత్

  • Published By: chvmurthy ,Published On : October 27, 2019 / 08:25 AM IST
బోరు బావి నుంచి బాలుడు క్షేమంగా రావాలి : రజనీ కాంత్

తమిళనాడులోని  తిరుచ్చి జిల్లా మనప్పారై లోని ఓ బోరు బావిలో పడ్డ రెండేళ్ల బాలుడిని కాపాడేందుకు సహాయచర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దేశమంతా ఆ చిన్నారి బయటకు రావాలని ఎదురుచూస్తోంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా చిన్నారి క్షేమంగా బయటకు వస్తాడని ఆశిస్తున్నానంటూ అభిమానులకు తెలిపారు. 

ఆదివారం దీపావళి పండుగ సందర్భంగా తనను  కలవటానికి వచ్చిన అభిమానులకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు.  సుజీత్ క్షేమంగా బయటపడాలని మనస్ఫూర్తిగా  దేవుడ్ని ప్రార్ధిస్తున్నానని అన్నారు. బాబును బయటకు తీసుకు వచ్చేందుకు  యంత్రాల సాయంతో కృషి చేస్తున్నారు.

అక్టోబరు 25 సాయంత్రం ఇంటివద్ద ఆడుకుంటూ  ప్రమాద వశాత్తు బాలుడు  నిరుపయోగంగా ఉన్న 600 అడుగుల మూతలేని బోరు బావిలో పడిపోయాడు. మొదట బాలుడు 35 అఢుగుల లోతులోనే ఉన్నాడని భావించినప్పటికీ తాజాగా 100 అడుగుల కిందకు జారిపోయినట్లు సహాయక సిబ్బంది చెప్పారు.  

బారు బావిలోకి ఆక్సిజన్ పంపిస్తూ  బాలుడిని బయటకు తీసేందుకు కృషి చేస్తున్నారు. మద్రాసు ఐఐటీకి చెందిన నిపుణులతో సహా ఆరు బృందాలు బాలుడిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.