మాట్లాడే స్వేచ్ఛ లేదు : మూటలు మోసిన IAS గోపీనాథన్ రాజీనామా

గతేడాది భారీ వర్షాలు,వరదలతో కేరళ అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ సమయంలో కేంద్రపాలిత ప్రాంతం దాద్రా అండ్ నగర్ హవేలి కలెక్టర్…ఓ సామన్య వ్యక్తిలా ఓ సహాయక శిభిరంలో 8 రోజుల పాటు మూటలు మోసినా ఎవ్వరూ ఆయన్ను గుర్తు పట్టేలేదు. చివరకు ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కన్నన్ గోపీనాథ్ అని మరో అధికారి గుర్తించడంతో ఆ విషయం తెలుసుకుని అక్కడున్నవాళ్లే కాకుండా దేశమంతా ఆశ్చర్యపోయిన విషయం తెలిసిందే. 

అయితే ఇప్పుడు ఈ యువ ఐఏఎస్ ఆఫీసర్ కన్నన్ గోపీనాథన్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం దాద్రానగర్ హవేలీ.. పవర్,అగ్రికల్చర్,పట్టణాభివృద్ధి కార్యదర్శిగా ఉన్న గోపీనాథన్ ఐఏఎస్ సర్వీసుకి రాజీనామా చేశాడు. ఆగస్టు-21,2019న  హోంసెక్రటరీకి ఈ మేరకు ఓ లేఖ రాశాడు. తనను సర్వీస్ నుంచి రిలీవ్ చేయాల్సిందిగా కోరాడు. తనకు భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ముఖ్యమని, గొంతు లేని వాళ్ల తరపున గొంతు వినిపించగలనని నమ్మి సర్వీసులో చేరానని, కానీ ఇప్పుడు తన సొంత గొంతును కూడా విప్పలేకపోతున్నానని,తన రాజీనామా తిరిగి తనకు తన వ్యక్తీకరణ స్వేచ్ఛను ఇస్తుందని గోపీనాథన్ తెలిపారు. తన రాజీనామా ఎలాంటి ప్రభావం చూపబోదని తనకు తెలుసునన్నారు. ఇది కేవలం రోజులో కొద్ది సమయం వార్తల్లో నిలుస్తుందని అన్నారు. తన అంతరాత్మ చెప్పిన మేరకే తను చేస్తానని అన్నారు. ఇప్పుడు తాను సొసైటీకి తానేం చేయగలనో ఆలోచిస్తున్నానన్నారు.

అధికార వర్గాల నుంచి అందిన వివరాల ప్రకారం…జమ్మూకశ్మీర్ కు ప్రత్యేకప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370రద్దు సమయంలో తన ఆలోచనలను స్వేచ్ఛగా వ్యక్తం చేయలేకపోయానని గోపీనాథన్ ఆ లేఖలో తెలిపినట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు