CM Biren Singh: ముఖ్యమంత్రి పదవికి రాజీనామాపై క్లారిటీ ఇచ్చిన మణిపూర్ సీఎం బిరేన్ సింగ్

మణిపూర్ గవర్నర్ అనుసూయా ఉయికేతో బిరేన్ సింగ్ భేటీ కావాలనుకున్నారు.

CM Biren Singh

CM Biren Singh – Manipur: మణిపూర్ ఆందోళనలతో అట్టుడికిపోతున్న వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ రాజీనామా చేయనున్న ప్రచారం జరిగింది. దీనిపై బిరేన్ సింగ్ స్పష్టతనిచ్చారు. ” ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో నేను ఓ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ముఖ్యమంత్రి పదవికి నేను రాజీనామా చేయడం లేదు ” అని చెప్పారు.

కాగా, ఇవాళ మణిపూర్ గవర్నర్ అనుసూయా ఉయికే(Anusuiya Uikey)తో బిరేన్ సింగ్ భేటీ కావాలనుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన గవర్నర్‌ను కలవడానికి వెళ్లే సమయంలో అక్కడకు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. రాజీనామా చేయవద్దని అన్నారు. ఇప్పటికే మణిపూర్‌ ఘర్షణలతో తగలబడి పోతోందని, రాజీనామా చేస్తే పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉంటుందని చెప్పారు. చివరకు రాజీనామా చేయట్లేదని బిరేన్ సింగ్ ప్రకటన చేశారు.

బిరేన్ సింగ్ కొన్ని రోజుల క్రితమే రాజీనామా లేఖను కూడా సిద్ధం చేసి పెట్టుకున్నారు. అయితే, దాన్ని ఆయన మద్దతుదారులు చించేశారు. రాజీనామా లేఖ చిరిగిపోయినట్లు ఉన్న ఓ ఫొటో వైరల్ అవుతోంది. మణిపూర్ లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న వేళ బిరేన్ సింగ్ తో పాటు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు