నేరం జరిగితే ఊరుకోరు, న్యాయం జరిగే వరకు నిద్రపోరు.. గిరిజన మహిళలకు అండగా నిలుస్తున్న ఐఏఎస్

IAS Officer divya devarajan Has One Mission: మాటలు చెప్పడం సులభమే. కానీ ఆచరణలో ఉంచడమే చాలా కష్టం. విధుల్లోకి రాక ముందు చాలామంది చాలా చెబుతారు. విధుల్లోకి వచ్చాక సైలెంట్ అయిపోతారు. కొందరు మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఏ లక్ష్యంతో అయితే వస్తారో దాన్ని నెరవేర్చకుండా నిద్రపోరు. ఇందుకు నిలువెత్తు నిదర్శనమే ఐఏఎస్ అధికారిణి దివ్య దేవరాజన్. మహిళలపై నేరం జరిగితే ఊరుకోదు, బాధితులకు న్యాయం జరిగే వరకు నిద్రపోదు.. ఇదీ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ దివ్య దేవరాజన్ నైజం.

దివ్య దేవరాజన్. వయసు 37ఏళ్లు. 2020లో ఐఏఎస్ పాస్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌. మహిళలపై నేరాలు జరక్కుండా నిరోధించడం ఆమె ప్రథమ లక్ష్యం. అన్యాయం జరిగిన బాధితులకు న్యాయం జరిగేలా చూడటం రెండో లక్ష్యం. దివ్య దేవరాజన్ డైనమిక్ ఆఫీసర్ గా గుర్తింపు పొందారు.

ముఖ్యంగా గిరిజన మహిళలపై దివ్య దేవరాజన్ ఫోకస్ చేశారు. నిత్యం వారికి అందుబాటులో ఉంటారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వారికి వివరిస్తారు. సామాజిక సమస్యలపై అవగాహన కల్పిస్తారు. అన్యాయాన్ని ఎలా ఎదుర్కోవాలో వారికి నేర్పిస్తారు. న్యాయం కోసం ఎలా పోరాడాలో వివరిస్తారు. అందుకే గిరిజన మహిళలకు దివ్య అంటే ఎంతో అభిమానం. మహిళలపై జరిగే నేరాలను రూపుమాపేందుకు దివ్య కృషి చేస్తున్నారు. ఇందుకోసం మహిళలకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తున్నారు. మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు.

ఇందుకోసం బెల్ బాజో ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. 64వేల మంది అంగన్ వాడీ వర్కర్ల సాయంతో ఆమె ఈ ఉద్యమాన్ని నడుపుతున్నారు. మహిళలపై జరిగే నేరాలు అరికట్టేందుకు కృషి చేస్తున్నారు. ఎవరైనా మహిళ గృహ హింసతో బాధపడుతున్నట్టు తెలిస్తే, వెంటనే మరో మహిళ ఆ ఇంటికి చేరుకుని బాధితురాలికి అండగా నిలుస్తుంది. ఆ విధంగా బాధితురాలిపై జరిగే హింసకు అడ్డుకట్ట పడుతుంది.

 

ఐఏఎస్ అధికారిణి దివ్య దేవరాజన్ ముందు ఓ మిషన్(లక్ష్యం) ఉంది. మహిళలపై జరిగే నేరాలను అరికట్టడం, బాధిత మహిళలకు న్యాయం జరిగేలా చూడటం, మహిళా సాధికారత. ఇవీ దివ్య దేవరాజన్ ముందున్న లక్ష్యాలు. ప్రస్తుతం వాటి సాధన దిశగా ఆమె ప్రయాణం సాగుతోంది. అంతేకాదు తాను అనుకున్నది సాధిస్తోంది కూడా. ఈ ప్రయాణంలో ఆమె సక్సెస్ అవ్వాలని, అనుకున్నది సాధించాలని మనమూ కోరుకుందాం. దివ్య దేవరాజన్ కు ఆల్ ద బెస్ట్ చెబుదాం. ఈ ఐఏఎస్ అధికారిణి మహిళా లోకానికే కాదు యువ అధికారులకు సైతం స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆమెని ఆదర్శంగా తీసుకుని మేము సైతం అంటూ మహిళలకు అండగా నిలిచేందుకు సిద్ధమవుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు