బొకే ఇచ్చినందుకు రూ.5 వేలు ఫైన్.. ఎందుకంటే

  • Publish Date - December 10, 2019 / 06:05 AM IST

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సిటీకి కొత్తగా వచ్చిన మున్సిపాలిటీ కమిషనర్ ఆస్తిక్ కుమార్ పాండే కి సోమవారం (డిసెంబర్ 9, 2019)న స్టాఫ్ అంతా కలిసి వెల్ కమ్ చెప్పారు. అయితే ఓ ఆఫీసర్ మాత్రం.. బొకే ఇచ్చి మరీ వెల్ కమ్ చెప్పాడు. దీంతో ఆ బొకే ఇచ్చి వెల్ కమ్ చెప్పినందుకు అతనికి 5వేలు ఫైన్ వేశారు. అదేంటి అనుకుంటున్నారా.. ఎందుకంటే ఆ బొకే ప్లాస్టిక్ కవర్ తో చుట్టి ఇచ్చినందుకు ఫైన్ వేశారు.  

అతను అదే మున్సిపాలిటీలో అర్బన్ డెవలప్ డిపార్ట్ మెంట్ చీఫ్ గా పని చేస్తున్నాడు. అతని పేరు రామచంద్ర మహాజన్, ప్లాస్టిక్ కవర్ తో చుట్టిన బొకే ఇచ్చి అడ్డంగా బుక్కయ్యాడు. ఆయన ఆదేశాల మేరకు సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ డిపార్ట్ మెంట్ వాళ్లు రామచంద్ర నుంచి ఫైన్ కట్టించుకున్నారు.

దీంతో మహారాష్ట్ర సర్కారు గత ఏడాది జూన్ లోనే ప్లాస్టిక్ తో పాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ డిస్పోజేబల్ ఐటెమ్స్ ను బ్యాన్ చేసింది. వాటిని తయారు చేయడం, వాడటం, స్టోర్ చేయడం, డిస్ట్రిబ్యూట్ చేయడం, ప్యాకింగ్ లో వాడితే ఫైన్ విధిస్తున్నారు.