YouTube Channels: ఆ 45 వీడియోలను బ్లాక్ చేయండి .. యూట్యూబ్‌ను కోరిన కేంద్రం.. ఎందుకంటే?

10 యూట్యూబ్ ఛానల్స్‌లోని 45 వీడియోలను బ్లాక్ చేయాలని వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్‌ని భారత ప్రభుత్వం సోమవారం కోరింది.

YouTube Channels: పది యూట్యూబ్ ఛానెళ్లలోని 45 వీడియోలను బ్లాక్ చేయాలని వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్‌ని భారత ప్రభుత్వం సోమవారం కోరింది. బ్లాక్ చేయబడిన వీడియోలలో ఫేక్ న్యూస్, మార్ఫింగ్ వీడియోలు వంటి కంటెంట్ ఉన్నాయి. అవి మతవర్గాల మధ్య ద్వేషాన్ని వ్యాప్తిచేసే ఉద్దేశ్యంతో ప్రసారం చేయబడ్డాయని కేంద్రం పేర్కొంది.

Android: మీకు ఆండ్రాయిడ్ ఫోన్ ఉందా? అయితే వెంటనే ఈ యాప్స్ తీసేయండి

ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుండి వచ్చిన ఇన్‌పుట్‌ల ఆధారంగా 1 కోటి 30లక్షల వీక్షకులు కలిగియున్న ఈ యూట్యూబ్ వీడియోలను బ్లాక్ చేయాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ యూట్యూబ్‌ను కోరింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ – 2021లోని నిబంధనల ప్రకారం సంబంధిత వీడియోలను బ్లాక్ చేయడానికి సెప్టెంబర్ 23న ఆదేశాలు జారీ చేయబడ్డాయి.

Viral News: పదేళ్ల క్రితం చేతిని పైకెత్తిన సాధువు.. ఇప్పటి వరకు కిందకు దించలేదట.. ఇంకెన్నాళ్లని ప్రశ్నిస్తే.. ఆయన ఏమన్నాడంటే..

యూట్యూబ్‌లో సర్క్యులేట్ అవుతున్న వీడియోలలో ప్రభుత్వం కొన్ని వర్గాల మతపరమైన హక్కులను ఉల్లంఘించిందని, మతపరమైన సంఘాలపై హింసాత్మక బెదిరింపులు, భారతదేశంలో అంతర్యుద్ధం ప్రకటించడం వంటి తప్పుడు వాదనలు ఉన్నాయని తెలిపింది. అలాంటి వీడియోలు మత విద్వేషాలకు కారణమయ్యే అవకాశం ఉన్నట్లు ఐ అండ్ బి మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు