Viral News: పదేళ్ల క్రితం చేతిని పైకెత్తిన సాధువు.. ఇప్పటి వరకు కిందకు దించలేదట.. ఇంకెన్నాళ్లని ప్రశ్నిస్తే.. ఆయన ఏమన్నాడంటే..

ఎవరికైనా చేతిని పైకెత్తి పదినిమిషాలు ఉంచితే నొప్పిగా ఉంటుంది. పోటీ పెట్టుకొని మరీ చేతిని పైకెత్తి ఉంచినా మహా అంటే అర్థగంట ఉంచగలుగుతాం.. ఇంకా ఎక్కువ సేపు ఉంచితే నొప్పిని భరించలేక ఆస్పత్రి పాలుకావాల్సి వస్తుంది. కానీ, ఓ సాధువు మాత్రం 10ఏళ్లుగా తన కుడిచేతిని పైకెత్తే ఉంచుతున్నాడట..

Viral News: పదేళ్ల క్రితం చేతిని పైకెత్తిన సాధువు.. ఇప్పటి వరకు కిందకు దించలేదట.. ఇంకెన్నాళ్లని ప్రశ్నిస్తే.. ఆయన ఏమన్నాడంటే..

Indian man

Viral News: ఎవరికైనా చేతిని పైకెత్తి పదినిమిషాలు ఉంచితే నొప్పిగా ఉంటుంది. పోటీ పెట్టుకొని మరీ చేతిని పైకెత్తి ఉంచినా మహా అంటే అర్థగంట ఉంచగలుగుతాం.. ఇంకా ఎక్కువ సేపు ఉంచితే నొప్పిని భరించలేక ఆస్పత్రి పాలుకావాల్సి వస్తుంది. కానీ, ఓ సాధువు మాత్రం 10ఏళ్లుగా తన కుడిచేతిని పైకెత్తే ఉంచుతున్నాడట.. ఇప్పటికీ అతని కుడిచేయి పైకెత్తే ఉంటుంది. రాత్రి నిద్రపోయే సమయంలోనూ చేయి పైకెత్తే ఉంటుందట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Snake In Student Bag: బాబోయ్.. విద్యార్థి బ్యాగులో పాము.. ఉపాధ్యాయుడు ఏం చేశాడంటే.. వీడియో వైరల్

సదరు సాధువును.. ఓ రిపోర్టర్ ఇంకెన్నాళ్లు ఇలా చేయి పైకెత్తి ఉంచుతారు అని ప్రశ్నించాడు. తాను గత పదేళ్లుగా చేతిని పైకెత్తి ఉంచుతున్నానని, ఇంకెన్నాళ్లు అలా? అనే ఆలోచన నాకు రాలేదని, తనకు సాధ్యమైనంత వరకు చేతిని పైకెత్తే ఉంచుతానని తెలిపాడు. అయితే, తాను నిద్రపోయేటప్పుడు కూడా చేతిని పైకే ఉంచుతానని, ఆ సమయంలోనూ ఎలాంటి ఇబ్బంది కలిగినట్లు అనిపించదని ఆ సాధువు తెలిపాడు. అయితే, సాధువు తన చేయి తిమ్మిరిగా అనిపించినప్పటికీ ఎడమ చేతితో వివిధ పనులను పూర్తి చేసుకుంటున్నాడు.

Russia School Attack: రష్యాలో దారుణం.. స్కూల్‌లో విద్యార్థులపై దుండగుడు కాల్పులు.. 13 మంది మృతి..

ఇదిలాఉంటే.. ఇలా చేయి పైకెత్తి ఉండటం ఈ సాధువే మొదటి వ్యక్తి కాదట. అమర్ భారతి అనే మరొక వ్యక్తి తన జీవితమంతా శివుడికి అంకితం చేయడానికి 45 సంవత్సరాలకు పైగా తన చేయిని పైకెత్తే ఉంచాడని యూనిలాడ్ నివేదిక వివరించింది. అయితే ప్రస్తుతం అతని రికార్డును మీరు బ్రేక్ చేయాలనుకుంటున్నారా అని రిపోర్టర్ సాధువును ప్రశ్నించగా.. తనకు సాధ్యమైనంత మేరకు చేతిని పైకెత్తే ఉంచుతానని సమాధానం ఇచ్చాడు.

ఈ విషయంపై సోషల్ మీడియాలో పలువురు స్పందిస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంతకాలం చేతిని పైకెత్తి ఉండటం తనకు నమ్మశక్యంగా లేదని, నేను నా చేతిని పైకెత్తి గంటసేపు ఉంచలేకపోయానని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. మరో నెటిజన్.. బహుశా తన కుడి చేతిని సాధువు ఒక సెకను పాటు కిందకు దించి ఉంటాడని చమత్కరించారు, దానికి మరో నెటిజన్ ఇలా సమాధానమిచ్చాడు.. “దేవుడు దూరంగా కనిపించినప్పుడు మాత్రమే. ఇలా పలువురు నెటిజన్లు తమ స్పందనను తెలియజేస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.