Snake In Student Bag: బాబోయ్.. విద్యార్థి బ్యాగులో పాము.. ఉపాధ్యాయుడు ఏం చేశాడంటే.. వీడియో వైరల్

మధ్య ప్రదేశ్ రాష్ట్రం షాజాపూర్ గ్రామంలోని పాఠశాలలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థి బ్యాగులోకి పాము దూరింది. బ్యాగు అటూఇటూ కదులుతుండటంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. ఉపాధ్యాయుడికి సమాచారం ఇవ్వడంతో అతను వచ్చి బ్యాగులోని పామును బయటకు తీసుకెళ్లి వదిలేశాడు.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Snake In Student Bag: బాబోయ్.. విద్యార్థి బ్యాగులో పాము.. ఉపాధ్యాయుడు ఏం చేశాడంటే.. వీడియో వైరల్

Snake In Student Bag

Shocking Incident: పామును చూస్తే చాలా మంది భయంతో వణికిపోతారు. ఇక విద్యార్థులు, చిన్నపిల్లలు ఆమడదూరం పరుగెడతారు. అలాంటిది ఓ విద్యార్థి బాగులో పాము కనిపించడంతో క్లాస్ రూంలోని విద్యార్థులు పరుగులు పెట్టారు. ఉపాధ్యాయుడు విషయం తెలుసుకొని బ్యాగును బయటకు తీసుకెళ్లి బ్యాగులో పుస్తకాల చాటున దాక్కున్న పామును వదిలేశాడు. అది బుసలు కొడుతూనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రం షాజాపూర్ గ్రామంలోని పాఠశాలలో చోటు చేసుకుంది.

Viral Video: టెన్నిస్ మ్యాచ్ జరుగుతుండగా కోర్టులోకి దూసుకొచ్చిన వ్యక్తి.. నిప్పంటించుకొని నిరసన.. ఎందుకంటే?

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోను బీజేపీ నేత కరణ్ వశిష్ఠ తన ట్విటర్‌లో పోస్టు చేశాడు. ఈ వీడియో పాము ఉన్న బ్యాగును ఉపాధ్యాయుడు బయటకు తీసుకొచ్చి పుస్తకాలు చాటున దాక్కున్న పామును బయటకు పంపిస్తున్నట్లుగా ఉంది. ఇందుకు సంబంధించి వివరాలు చూస్తే.. షాజాపూర్ గ్రామంలోని బడోని స్కూల్ లో ఉదయాన్నే ఓ విద్యార్థి స్కూల్ కు వచ్చింది. అప్పటికే ఆ బ్యాగులో పాము ఉంది. పుస్తకాల కింద ఏం చక్కా పడుకొని ఉంది. స్కూల్‌కు వచ్చిన కొద్దిసేపటికే బ్యాగు కదులుతుండటాన్ని గమనించారు. భయాందోళనకు గురైన విద్యార్థులు విషయాన్ని ఉపాధ్యాయుడికి తెలియజేశాడు.

ఉపాధ్యాయుడు బ్యాగులో ఏముందా అని తెరిచిచూడగా ఖంగుతిన్నాడు. అందులో పాము కనిపించడంతో విద్యార్థులందరినీ అక్కడి నుంచి పంపించి వేశారు. నెమ్మదిగా ఆ బ్యాగును తీసుకొని స్కూల్ బయటకు వచ్చాడు. అక్కడ బ్యాగును కిందపెట్టి పామును బయటకు పంపించే ప్రయత్నం చేశాడు. అయినా పాము బయటకు రాకపోవటంతో.. నెమ్మదిగా బ్యాగులోని పుస్తకాలను తీసి బ్యాగును పైకిలేపి కిందకు దులిపాడు. దీంతో పాము కిందపడి బుసలు కొట్టింది. అనంతరం నెమ్మదిగా అది అక్కడి నుంచి పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ రీ ట్వీట్లు చేస్తున్నారు.