Russia School Attack: రష్యాలో దారుణం.. స్కూల్‌లో విద్యార్థులపై దుండగుడు కాల్పులు.. 13 మంది మృతి..
రష్యాలోని ఇన్‌హెవెన్స్ సిటీలోని ఓ పాఠశాలలో గుర్తుతెలియని దుండగుడు కాల్పులు జరపడంతో 13 మంది మరణించారు. మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. అయితే.. కాల్పులు జరిపిన వ్యక్తి తనను తాను కాల్చుకొని మరణించినట్లు తెలిసింది.

Russia School Shooting
రష్యాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇన్‌హెవెన్స్ సిటీలోని ఓ పాఠశాలలో గుర్తుతెలియని దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపి రక్తపుటేరులు పారించాడు. ఈ ఘటనలో 13 మంది మరణించారు. వీరిలో తొమ్మిది మంది విద్యార్థులు కాగా, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు, ఇద్దరు టీచర్లు ఉన్నారు. మరో 21 మంది తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకొని కాల్పులు జరిపిన దుండగుడిని పట్టుకొనేందుకు ప్రయత్నించారు.
అయితే గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే.. విద్యార్థులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన దుండగుడు కూడా తనకు తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ టెలిగ్రామ్‌లో ఒక ప్రకటనలో పేర్కొంది.
https://twitter.com/i24NEWS_EN/status/1574332198110597123?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1574332198110597123%7Ctwgr%5Eb43d222ddc4a6bce65271e40f12732b2247f8ace%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.dawn.com%2Fnews%2F1712067
దుండగుడు బ్లాక్ కలర్‌లో ఉన్న దుస్తులు ధరించినట్లు రష్యా బలగాలు పేర్కొన్నాయి. ఆ డ్రెస్‌పై నాజీ సింబల్స్ ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ కాల్పులు ఎందుకు జరిపాడో తెలియాల్సి ఉంది. ఈ విషయంపై స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. దుండగుడి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. సదరు వ్యక్తికి 25 ఏళ్లు ఉన్నట్లు గుర్తించారు.