ICMR Vaccine Mixing : కోవిషీల్డ్, కోవాగ్జిన్ కలిపి వేసుకోవచ్చు..ఐసీఎంఆర్ కీలక ప్రకటన

రెండు వేర్వేరు వ్యాక్సిన్లు కలిపి తీసుకోవడానికి సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) కీలక ప్రకటన చేసింది.

covishield and covaxine : రెండు వేర్వేరు వ్యాక్సిన్లు కలిపి తీసుకోవడానికి సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) కీలక ప్రకటన చేసింది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ మిక్స్ చేసి వేసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని ఐసీఎంఆర్ ప్రకటించింది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ కలిపి తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందని అంటోంది.

రెండు వ్యాక్సిన్లను కలిపి తీసుకోవడంపై ఎప్పటినుంచో చర్చ నడుస్తన్న మన దేశంలో ఆ మేరకు పరిధోనలు జరుపుతున్నారు. దీనిపై ఐసీఎంఆర్ కూడా అధ్యయనం చేసింది. రెండు వ్యాక్సిన్లను కలిపి తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు వచ్చినట్లు తమ పరిశోధనలో తేలినట్లు తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు