Child Adoption : పిల్లల్ని దత్తత తీసుకోవాలనుకుంటున్నారా? ప్రోసీజర్ ఇదే..

పిల్లలు కనలేరని నిర్ధారణ అయిన జంట తెలిసిన వారి నుంచి, బంధువుల నుంచి పిల్లల్ని దత్తత తీసుకోకూడదు. అలా చేస్తే చట్టపరంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రభుత్వ అనుమతితో మాత్రమే దత్తత తీసుకోవాలి. అందుకు ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సిందే.

Child Adoption

Child Adoption : కొంతమంది తమకు పిల్లలు పుట్టరని నిర్ధారణ అయ్యాక తెలిసిన వారి నుంచి పిల్లల్ని తీసుకుంటారు. ఇలా తీసుకోవడం వల్ల చట్టపరంగా తర్వాత అనేక సమస్యలు రావచ్చు. ప్రభుత్వ అనుమతితో పిల్లల్ని దత్తత తీసుకోవాలంటే దానికో ప్రొసీజర్ ఉంటుంది. అది ఫాలో అవ్వాల్సిందే.

Raghava Lawrence : నువ్వు దేవుడివి సామి.. ఇంకో 150 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకున్న లారెన్స్..

పిల్లల్ని దత్తత తీసుకునే ముందు మానసికంగా అందుకు సిద్ధమై ఉండాలి. ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాలి.  పిల్లలు కనలేని జంటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దత్తత తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అయితే దీనికి ప్రొసీజర్ ఉంది. అనాథ శరణాలయాల్లో చాలామంది పిల్లలు ఉంటారు. అయితే వారిని నేరుగా తీసుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. కోర్టు ద్వారా తీసుకోవాలన్నా కూడా ఆ పిల్లలకు 15 ఏళ్లు నిండి ఉండాలి. దత్తత తీసుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాత స్త్రీ,శిశు సంక్షేమ శాఖ వెబ్ సైట్‌లో ఆధార్ కార్డు సాయంతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అందులో దత్తత తీసుకోవాలనుకుంటున్న వారి పూర్తి చిరునామా పొందుపరచాలి. ఆదాయం, పాన్ కార్డు, వివాహ నమోదు పత్రం, ఆరోగ్య ధ్రువీకరణ పత్రం, ఇద్దరు వ్యక్తుల హామీ అవసరం ఉంటుంది.

అన్నీ పత్రాలు సరిగా ఉంటే వెయిటింగ్ లిస్ట్‌లో పెడతారు. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. దత్తతకు పాప లేదా బాబు సిద్ధంగా ఉంటే వారి పూర్తి వివరాలు పంపుతారు. అన్నీ నచ్చితే ఆ బిడ్డను తెచ్చుకోవచ్చును. నచ్చక వదిలేస్తే మరో 60 రోజుల తర్వాత ఇంకో బిడ్డ వివరాలు పంపిస్తారు.

PM Kisan Tractor Scheme :రైతులు 50 శాతం సబ్సిడీతో ట్రాక్టర్ కొనుక్కోవచ్చు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి? స్కీమ్ పూర్తి వివరాలు..

బిడ్డను దత్తత తీసుకోవడానికి అంగీకరిస్తే ఫ్యామిలీ కోర్టు‌లో దత్తత హియరింగ్‌కు వెళతారు. జడ్జ్ సమక్షంలో ప్రమాణం చేయించి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి పత్రాలు పరిశీలించి కోర్టు ఆర్డర్ ఇస్తారు. దత్తత ఇచ్చేటపుడు ఉచితంగా ఉండదు. కొంత డబ్బును అనాథ శరణాలయానికి డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ప్రొసీజర్ ప్రకారం దత్తత తీసుకుంటేనే ఆ పిల్లలకు అధికారికంగా తల్లిదండ్రులు అవుతారు. ప్రభుత్వం ఈ విషయాన్ని ధ్రువీకరిస్తే పత్రం ఇస్తుంది. చుట్టాలు, తెలిసిన వారి దగ్గర నుంచి పిల్లల్ని దత్తతకు తీసుకుంటే ఆ తరువాత చట్ట, న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడైనా ఆ పిల్లల తల్లిదండ్రులు వచ్చి తమ బిడ్డలను తీసుకెళ్లే హక్కు వారికి ఉంటుంది. ఆడ,మగ పిల్లల దత్తత విషయంలో నిబంధనలు వేరుగా ఉంటాయి. దత్తతకు వెళ్లిన ఆడపిల్లలు మేజర్లు అయ్యే దాకా చట్టపరిధిలో ఆయా సంస్థలు పరిశీలన చేస్తాయి.