బీజేపీ చేసేది ఇదే : కన్విన్స్ కాకుంటే.. కన్ఫ్యూజ్ చేయండి : అశోక్ చావన్

  • Publish Date - November 25, 2019 / 07:22 AM IST

మహారాష్ట్ర రాజకీయం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీలను దొంగదెబ్బ తీసిన బీజేపీకి ఎలాగైనా తగిన గుణపాఠం చెప్పాలని ఎత్తుకుపైఎత్తులు వేస్తున్నాయి. మహారాష్ట్ర వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్లడంతో మహా అధికారం ఎవరివైపు అనేది ఉత్కంఠ నెలకొంది.

సంఖ్యాబలాన్ని నిరూపించుకునేందుకు పార్టీలన్నీ ప్రయత్ని స్తున్నాయి. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు అంతా సిద్ధం చేసుకున్న తరుణంలో గద్దొచ్చి కోడిపిల్లను తన్నుకెళ్లినట్టు రాత్రికిరాత్రే ఎన్సీపీ నేత అజిత్ పవార్ ను బీజేపీ తమ గూటికి లాగేసుకుంది. బీజేపీ వైఖరిపై ఎన్సీపీ సహా శివసేన, కాంగ్రెస్ భగ్గుమన్నాయి. 

అజిత్ సహా ఆయనకు మద్దతుగా కొంతమంది ఎమ్మెల్యేలు కమలానికి జైకొట్టారు. దీనిపై సీనియర్ కాంగ్రెస్ నేత అశోక్ చావన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్సీపీ నేత అజిత్ ఎరగా వేసి ప్రజలను కన్ఫూజ్ చేస్తోందని ఆయన ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. ‘పార్టీ వీడిన ఎమ్మెల్యేలను ఒప్పించండి లేదంటే కన్ఫ్యూజ్ చేయండి.

బీజేపీ కూడా ఇదే పని చేస్తోంది. భుజాల వెనుక తుపాకీ పెట్టి ఇలానే చేస్తోంది’ అని ఆయన ట్వీట్ చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను హోటల్ కు తరలించి సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, మల్లికార్జన్ ఖార్గేలతో సమావేశమైన వీడియోను అశోక్ చావన్ పోస్టు చేశారు. మా ఎమ్మెల్యేందరూ ఐకమ్యతంతో ఎంతో బలంగా ఉన్నారని మరో ట్వీట్ చేశారు.