Rahul Gandhi : నేను కశ్మీర్ పండిట్ ని..BJP-RSS పై రాహుల్ ఫైర్

రెండు రోజుల జమ్ముకశ్మీర్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ జమ్ము సిటీలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. 'జై మాతా ది' అని నినాదాలు

Rahul

Rahul Gandhi In Jammu రెండు రోజుల జమ్ముకశ్మీర్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ జమ్ము సిటీలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ‘జై మాతా ది’ అని నినాదాలు చేయడం నుండి తనను తాను కాశ్మీరీ పండిట్ అని చెప్పడం వరకు రాహుల్ గాంధీ శుక్రవారం జమ్మూ బహిరంగ సభలో ప్రసంగించినప్పుడు స్థానికులతో సంబంధాన్ని ఏర్పరచుకునేందుకు ప్రయత్నించారు.

జమ్మూకశ్మీర్ తో తన కుటుంబానికి సుదీర్ఘ సంబంధం ఉందని.. ఇక్కడికి వస్తే తన ఇంటికి తాను వచ్చినట్లుగానే అనిపిస్తుందని రాహుల్ అన్నారు. తాను కాశ్మీరీ పండిట్ అని మరియు తన కుటుంబం కాశ్మీరీ పండిట్ అని రాహుల్ అన్నారు. ఈ రోజు ఉదయం, కశ్మీరీ పండిట్ల ప్రతినిధి బృందం తనను కలిసిందని.. . కాంగ్రెస్ వారి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని, కానీ బీజేపీ ఏమీ చేయలేదని వారు తనకు చెప్పారని రాహుల్ తెలిపారు. “నా కశ్మీరీ పండిట్ సోదరులకు నేను ఏదో ఒకటి చేస్తానని వాగ్దానం చేస్తున్నాను” అని రాహుల్ గాంధీ అన్నారు, జమ్మూ కాశ్మీర్ తర్వాత తాను లడఖ్ కూడా సందర్శిస్తానని రాహుల్ చెప్పారు.

ఈ సందర్భంగా బీజేపీ-ఆర్ఎస్ఎస్ పై తీవ్రస్థాయిలో రాహుల్ విరుచుకుపడ్డారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ జమ్మూ కశ్మీర్ మిశ్రమ సంస్కృతిని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తోందని రాహుల్ విమర్శించారు. జమ్మూ కశ్మీర్ కి రాష్ట్ర హోదాను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించాలని రాహుల్ డిమాండ్ చేశారు.

జమ్మూకశ్మీర్ కి తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందఅని కానీ తాను కూడా బాధపడ్డానని రాహుల్ తెలిపారు. జమ్మూకశ్మీర్ లో సోదరభావం ఉందని కానీ ఆ సోదర బంధాన్ని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయని రాహుల్ గాంధీ అన్నారు.

ఈ సందర్భంగా తన చేతిని పైకి ఎత్తి తన అరచేతిని కార్యక్రమానికి హాజరైన కార్యకర్తలకు చూపిస్తూ.. “చేయి అంటే దారో మత్ (భయపడవద్దు)అని అర్ధం. శివుడు మరియు వాహె గురు చిత్రాలలో చేతిని మీరు చేయి చూడవచ్చు అని రాహుల్ అన్నారు.

కాగా,రెండు రోజుల జమ్మూకశ్మీర్ పర్యటన కోసం గురువారం మధ్యాహ్నం జమ్మూ చేరుకున్న రాహుల్ అక్కడినుంచి కత్రా చేరుకొని కాలినడకన మాతా వైష్ణోదేవి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే.