Mamata Banerjee: నేను లాయర్‌ని.. హైకోర్టులో ఎప్పుడైనా ప్రాక్టీస్ చేస్తా: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

తానొక లాయర్‌ని అని, అవసరమైనప్పుడు న్యాయవాదిగా హైకోర్టుకు వచ్చి కేసులు వాదించగలనని చెప్పారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. తనకు బార్ కౌన్సిల్‌లో కూడా సభ్యత్వం కూడా ఉన్నట్లు వెల్లడించారు. కోల్‌కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

Mamata Banerjee: తానొక లాయర్‌ని అని, అవసరమైనప్పుడు ఎప్పుడైనా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తా అని చెప్పారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. రాజధాని కోల్‌కతాలో కొత్తగా నిర్మించిన సెక్రటేరియట్ బ్లాక్‌ను కోల్‌కతా హైకోర్టుకు కేటాయించారు. ఈ సందర్భంగా బిల్డింగ్ అప్పగించే కార్యక్రమం జరిగింది.

Salman Rushdie: సల్మాన్ రష్దీపై దాడిని ఖండించిన భారత్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో మమతా బెనర్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మమత మాట్లాడారు. ‘‘నేను లాయర్‌ని. బార్ కౌన్సిల్‌లో కూడా సభ్యత్వం ఉంది. గతంలో కొన్ని మానవ హక్కుల కేసుల్ని వాదించాను. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు హైకోర్టుకు వచ్చి, కేసు వాదించగలను’’ అని మమత వ్యాఖ్యానించారు. అలాగే కేసు ట్రయల్స్ సందర్భంగా మీడియాను అనుమతించవద్దని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరారు. ‘‘పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేయాలి. మహిళలకు న్యాయవ్యవస్థలో స్థానం కల్పించాలి. జడ్జిలుగా మహిళలకు వీలున్నన్ని ఎక్కువ అవకాశాలు ఇవ్వండి. మనకు తక్కువ మంది మాత్రమే మహిళా జడ్జీలు ఉన్నారు. మీడియాను ట్రయల్స్‌కు అనుమతించవద్దు.

CM KCR: పంటలు పండే తెలంగాణ కావాలా.. మత పిచ్చితో రగిలే మంటల తెలంగాణ కావాలా? ప్రశ్నించిన సీఎం కేసీఆర్

కొన్నిసార్లు కేసుల్ని మీడియా తప్పుదోవ పట్టిస్తోంది. ఒకరు విశ్వాసం కోల్పోతే.. మరొకరు కూడా విశ్వాసం కోల్పోతారు. న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యానికి పునాదిలాంటిది. ఇది పాక్షికంగా మాత్రమే అందకూడదు. ఇతర వ్యవస్థల మీద నమ్మకం కోల్పోయినప్పుడు ప్రజలు న్యాయవ్యవస్థనే ఆశ్రయిస్తారు’’ అని మమత వ్యాఖ్యానించారు.