CM KCR: పంటలు పండే తెలంగాణ కావాలా.. మత పిచ్చితో రగిలే మంటల తెలంగాణ కావాలా? ప్రశ్నించిన సీఎం కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క మంచి పని చేసిందా? దేశానికి ఎందుకు మంచినీళ్లు ఇవ్వలేకపోతున్నారు? అంటూ కేంద్రంలోని బీజేపీపై విమర్శలు గుప్పించారు సీఎం కేసీఆర్. గురువారం రంగారెడ్డి జిల్లాలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు.

CM KCR: పంటలు పండే తెలంగాణ కావాలా.. మత పిచ్చితో రగిలే మంటల తెలంగాణ కావాలా? ప్రశ్నించిన సీఎం కేసీఆర్

CM KCR's visit to Peddapalli

CM KCR: పంటలు పండే తెలంగాణ కావాలో.. మత పిచ్చితో రగిలే మంటల తెలంగాణ కావాలో తేల్చుకోవాలన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. రంగారెడ్డి జిల్లా నూతన కలెక్టరేట్‌ను గురువారం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం, కొంగరకలాన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీపై విమర్శలు గుప్పించారు.

Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి.. 27న హన్మకొండలో భారీ సభ

‘‘కేంద్ర ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క మంచి పని చేసిందా? దేశానికి ఎందుకు మంచినీళ్లు ఇవ్వలేకపోతున్నారు? మంచి నీళ్లు ఇచ్చే తెలివితేటలు లేవా? వాళ్లే వచ్చి మనకు చెప్పాలా? దేశ రాజధాని ఢిల్లీలో కరెంట్ ఉండదు. 58 ఏళ్లు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. కర్ణాటకలో హిజాబ్, హలాల్ అంటూ మత పిచ్చి లేపారు. ఇక్కడ కూడా అలాంటి మతపిచ్చి లేపే ప్రయత్నం చేస్తున్నారు. నా కంఠంలో ప్రాణం ఉండగా తెలంగాణను ఆగం కానివ్వను. బీజేపీ వాళ్లు ఎక్కడా ఉద్ధరించలేదు. పక్కనే ఉన్న కర్ణాకటలో చూస్తేనే తెలుస్తుంది. మోసపోతే.. గోసపడుతాం. సంక్షేమ పథకాలు ఉండాలో.. పోగొట్టుకోవాలో ఆలోచించుకోవాలి. పంటలు పండే తెలంగాణ కావాలా? మత పిచ్చితో రగిలే మంటల తెలంగాణ కావాలా? తెలంగాణ ఏర్పాటు సమయంలో రంగారెడ్డి జిల్లాలో అనేక తప్పుడు ప్రచారాలు చేశారు. భూముల ధరలు తగ్గిపోతాయన్నారు. స్వతంత్ర భారతంలో హైదరాబాద్ స్టేట్‌గా ఉండేవాళ్లం.

Asaduddin Owaisi: రాష్ట్రాన్ని ఆహుతి చేద్దామనుకున్నారా.. బీజేపీపై అసదుద్దీన్ ఫైర్

తర్వాత మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగమయ్యాం. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో 400 మంది విద్యార్థులు చనిపోయారు. తర్వాత మళ్లీ తెలంగాణ ఉద్యమం చేయాల్సి వచ్చింది. తెలంగాణలో 93 శాతం చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. రైతు బంధు, రైతు బీమాతో రైతులను ఆదుకుంటున్నాం. రైతు బంధు డబ్బులు కూడా నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ అవుతున్నాయి. రైతులు పండించే పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. దివ్యాంగులకు రూ.3 వేలు ఇచ్చి ఆదుకుంటున్నాం’’ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.