PM Modi : భారతదేశం ప్రపంచ ప్రకాశవంతమైన ప్రదేశం.. ఐఎంఎఫ్ నివేదికపై ప్రధాని మోదీ ట్వీట్..

ఐఎంఎఫ్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి రేటు 2024లో నెమ్మదించి 2.9 శాతానికి పరిమితం కావొచ్చని ఐఎంఎఫ్ పేర్కొంది.

PM Narendra Modi

PM Modi Tweet On IMF Growth Forecast Report: గ్లోబల్ ఎకానమీ గురించి ఆందోళనల మధ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి అంతకు ముందు 6.1శాతం నుంచి 6.3శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వెల్లడించింది. వరల్డ్ ఎకనామిక్ అవుట్ లుక్ పేరుతో ఐఎంఎఫ్ తాజాగా విడుదల చేసిన అంచనాల్లో భారతదేశంలో 2023, 2024ల్లో వృద్ధి రేటు బలంగా 6.3శాతం నమోదు కావొచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది. అంటే 0.2శాతం మేర పెంచింది. ఏప్రిల్ – జూన్ మధ్య కాలంలో ఊహించిన దానికంటే మన దేశంలో వినియోగం పెరగడంతోనే వృద్ధి అంచనాను సవరిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.

Read Also : Gold Price Today : అక్కడ యుద్ధం.. ఇక్కడ ఎఫెక్ట్..! వరుసగా ఐదోరోజు భారీగా పెరిగిన బంగారం ధర..

ఐఎంఎప్ నివేదికపై ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా స్పందించారు. మా ప్రజల బలం, నైపుణ్యాలతో ఆధారితమైన భారతదేశం ప్రపంచ ప్రకాశవంతమైన ప్రదేశం అని అన్నారు. వృద్ధి, ఆవిష్కరణల శక్తి కేంద్రంగా భారతదేశం ఉందని చెప్పారు. సంపన్న భారతదేశం వైపు మా ప్రయాణాన్ని బలోపేతం చేస్తూ, మా సంస్కరణల పథాన్నిమరింత పెంచుతూనే ఉంటామని మోదీ ట్వీట్ లో పేర్కొన్నారు.

https://twitter.com/narendramodi/status/1711795229484089826

 

ఐఎంఎఫ్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి రేటు 2024లో నెమ్మదించి 2.9 శాతానికి పరిమితం కావొచ్చని ఐఎంఎఫ్ పేర్కొంది. గత జులై అంచనా ప్రకారం ఇది మూడు శాతం. ఈ ఏడాది మాత్రం అంతర్జాతీయ వృద్ధిరేటు 3శాతంగా నమోదు కావొచ్చని పేర్కొంది. 2022లో ఇది 3.5శాతంగా నమోదైన విషయం తెలిసిందే. ఇదిలాఉంటే అంతర్జాతీయ వినియోగదారు ధరల ద్రవ్వోల్బణం 2022లో 8.7శాతంగా నమోదు కాగా, 2023లో 6.9శాతానికి, 2024లో 5.8శాతానికి దిగిరావొచ్చని అంచనా వేసింది.