Indian Army: గాల్వాన్ లోయను సందర్శించిన ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్ట్‌నెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది

భారత్ - చైనా సైనిక ఘర్షణల అనంతరం భారత ఆర్మీకి చెందిన అత్యున్నత స్థాయి అధికారి ఇక్కడి సైనిక శిబిరాలను సందర్శించడం జూన్ 2020 తరువాత ఇదే ప్రధమం

Upendra Dwivedi

Indian Army: నార్తర్న్ ఆర్మీ కమాండర్ గా కొత్తగా నియమితులైన లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సోమవారం లడఖ్ లోని ఫార్వర్డ్ ప్రాంతాలైన గాల్వాన్ లోయ, ‘గ్రౌండ్ జీరో’లను సందర్శించారు. సందర్శనలో భాగంగా డోగ్రా రెజిమెంట్ సైనికులతో ఆయన జరిపిన సంభాషణకు సంబంధించిన చిత్రాలను ఇండియన్ ఆర్మీ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఎల్ఏసీ వెంట.. గాల్వాన్ లోయలోని ఫార్వర్డ్ ప్రాంతాల్లో తీసినవిగా చెప్పబడుతున్న ఆ చిత్రాలలో భారతీయ జెండా కూడా ఉండడం గమనార్హం. సరిహద్దు వెంట గాల్వాన్ లోయలో జరిగిన భారత్ – చైనా సైనిక ఘర్షణల అనంతరం భారత ఆర్మీకి చెందిన అత్యున్నత స్థాయి అధికారి ఇక్కడి సైనిక శిబిరాలను సందర్శించడం జూన్ 2020 తరువాత ఇదే ప్రధమం. దీంతో లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సందర్శనకు ప్రాధాన్యత సంతరించుకుంది.

Also read: Crude Price: భారత్‌లో భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎందుకంటే?

“నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఎల్ఏసీ వెంట.. ఫార్వర్డ్ ఏరియాల్లో సూన్య స్థావరాలను సందర్శించి భద్రతా పరిస్థితులను సమీక్షించారని, ఈసందర్భంగా అక్కడ సైనికులు చేపట్టిన కార్యాచరణను, ప్రదర్శిస్తున్న వృత్తి నైపుణ్యాలను ఆయన ప్రశంసించారని” ఇండియన్ ఆర్మీకి చెందిన నార్తర్న్ కమాండ్ తెలిపింది. అయితే గాల్వాన్ లోయలోని ఏ ప్రాంతాన్ని ఆయన సందర్శించారనే విషయాన్ని ఆర్మీ అధికారులు స్పష్టం చేయకపోనప్పటికీ, డోగ్రా రెజిమెంట్ సైనిక శిభిరాలను సందర్శించారనే విషయాన్ని మాత్రమే వెల్లడించారు.

Also read: Russia – Ukraine Tensions Live Updates: రష్యా – యుక్రెయిన్ వార్ టెన్షన్స్ – లైవ్ అప్ డేట్స్

ఈ సందర్శనలో భాగంగా లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది.. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC) వెంబడి ఫార్వార్డ్ పోస్టింగ్‌ల వద్ద విధులు నిర్వహిస్తున్న ప్రత్యేక సరిహద్దు దళం (SFF) అధికారులను, ఇతర సిబ్బందిని కూడా కలిశారు. SFF అనేది టిబెటన్‌లతో కూడిన ఇండియన్ ఆర్మీకి చెందిన “ఎలైట్ యూనిట్”. ఈ విభాగంలో పనిచేసే సైనికులు ప్రపంచంలోనే అత్యంత నిష్ణాతులుగా, శుత్రు ధుర్బేద్యంగా శిక్షణ పొందియున్నారు. ఇక తన మొదటి సందర్శనలో భాగంగా నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది.. దౌలత్ బేగ్ ఓల్డి (DBO) ప్రాంతాన్ని సైతం సందర్శించారు. ఈప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు మొదటి నుంచి చైనా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.

Also read: National Front: కాంగ్రెస్ లేకుండా మరో కూటమి సాధ్యంకాదన్న శివసేన, ఎన్సీపీ