Leftover food: హోటల్ లో తినగా మిగిలిపోయిన ఆహారాన్ని క్యారేజీలో పట్టుకెళ్లిన వ్యక్తి: వైరల్ వీడియో

ఫ్యామిలీతో కలిసి ఓ ఖరీదైన రెస్టారెంట్ కి వెళ్లిన ఒక వ్యక్తి..అక్కడ తాను తినగా మిగిలిన ఆహారాన్ని..ఒక టిఫిన్ బాక్స్ లో నింపుకు వెళ్ళాడు

Leftover

Leftover food: మనలో చాలామంది రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్నప్పుడు తినగలిగినంత తిని మిగిలింది వదిలేస్తుంటాం. ఇటువంటి సందర్భాల్లోకొందరైతే.. వెయిటర్లకు చెప్పి మిగిలిన ఆహారాన్ని పార్సెల్ చేయమని చెబుతారు..మరికొందరు ఆహారాన్ని అలాగే వదిలివెళ్తారు. అయితే అన్నం విలువ తెలిసిన ఎవరూ కూడా భోజనాన్ని అలా వృధా చేయరు. అలా ఫ్యామిలీతో కలిసి ఓ ఖరీదైన రెస్టారెంట్ కి వెళ్లిన ఒక వ్యక్తి..అక్కడ తాను తినగా మిగిలిన ఆహారాన్ని..ఒక టిఫిన్ బాక్స్ లో నింపుకు వెళ్ళాడు. మిగిలిపోయిన ఆహారాన్ని పార్సెల్ చేసేందుకు హోటల్ వారు ఇచ్చే ప్లాస్టిక్ కవర్ ను తీసుకోవడానికి కూడా ఇష్టపడని ఆ వ్యక్తి..తానే స్వయంగా బాక్స్ వెంట తెచ్చుకోవడం విశేషం.

Also Read:Rajastan Unsafe: మహిళలకు అస్సలు భద్రత లేని రాష్ట్రాల్లో రాజస్థాన్ అగ్రస్థానం: జాతీయ మహిళా కమిషన్

నయన ప్రేమనాథ్ అనే యువతి తన తండ్రితో కలిసి ఇటీవల ఒక ఖరీదైన రెస్టారెంట్ కు వెళ్ళింది. తమతో పాటుగా ఒక స్టీల్ బాక్స్ ని సైతం తెచ్చుకున్నారు కుటుంబ సభ్యులు. రెస్టారెంట్ లో తమకు కావాల్సిన ఆహారాన్ని ఆర్డర్ చేసుకున్న నయన కుటుంబ సభ్యులు..అక్కడ తినగలిగినంత తిని..మిగిలిన ఆహారాన్ని ముందుగా తెచ్చుకున్న స్టీల్ బాక్స్ లో నింపుకున్నారు. అయితే ఇలాంటి స్టార్ హోటల్స్ కి వచ్చే కస్టమర్లు మిగిలిన ఆహారాన్ని వదిలేసి వెళ్తుంటారు. కానీ..నయన తండ్రి మాత్రం ఆ ఆహారాన్ని బాక్స్ లో నింపుకున్నారు. దీనిపై నయన స్పందిస్తూ..ఇలాంటి విషయంలో అస్సలు సిగ్గు పడాల్సిన అవసరం లేదని..ఆహార విలువ అందరూ తెలుసుకోవాలని పేర్కొంది.

Also read:Old man locked in Bank: పాపం పెద్దాయన.. రాత్రంతా బ్యాంకులోనే ఉంచి తాళం వేశారు..!

తమ తల్లిదండ్రులు ఎంతో కస్టపడి ఈస్థితికి వచ్చారని..ప్రతి రూపాయిని ఎంత విలువగా చూసుకుంటామో..ఆహారాన్ని కూడా అంతే విలువగా చూడాలని నయన పేర్కొంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇటువంటి లక్షణాలు నేర్పిస్తే..పొదుపు పై చిన్నారులకు ఇప్పటినుంచే అవగాహన కలిగి ఉంటారని నయన వివరించింది. ఇక ఈ దృశ్యాన్ని వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా..నెటిజెన్లు సైతం ఫిదా అయ్యారు. ప్రజలు ఇటువంటి పద్దతులు అలవర్చుకోవాలని సూచిస్తున్నారు.

Also Read:PM Modi – PMAY: 5.21 లక్షల మంది పేదలకు ఇళ్ల పంపిణీ ప్రారంభించిన ప్రధాని మోదీ