Akhilesh-Yogi: యూపీ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన: కరచాలనం చేసుకున్న యోగి, అఖిలేష్

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో సోమవారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సీఎం యోగి ఆదిత్యనాథ్..ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ పరస్పరం కరచాలనం చేసుకున్నారు

Akhilesh-Yogi: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో సోమవారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సీఎం యోగి ఆదిత్యనాథ్..ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ పరస్పరం కరచాలనం చేసుకున్నారు. అఖిలేష్ బుజం తడుతూ సీఎం యోగి..కాసేపు స్నేహపూర్వకంగా మాట్లాడారు. అనంతరం ఇరువురు వ్యక్తిగత విషయాలపై చర్చించ్చుకున్నారు. గత ఐదేళ్లుగా అధికార ప్రతిపక్షంలో ఉన్న ఈ నేతలు ఇద్దరూ..రాజకీయ పరంగా పరస్పర మాటల దాడి చేసుకున్నారు. ఈక్రమంలో నేడు ఇద్దరు నేతలు ఇలా స్నేహ పూర్వకంగా మెలగడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన శాసనసభ్యుల ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా బీజేపీ, ఎస్పీ నేతలు అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన యోగి ఆదిత్యనాథ్..లక్నోలోని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో అట్టహాసంగా సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. యోగి ప్రమాణ స్వీకారోత్సవంపై ప్రతిపక్ష నేత, ఎస్పీ లీడర్ అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. “మేము నిర్మించిన స్టేడియంలో మీరు ప్రమాణ స్వీకారం చేశారు” అంటూ ట్వీట్ చేశారు.

Also Read:Madhya Pradesh: స్కూల్ పిల్లల సిలబస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

ఇక సోమవారం శాసనసభ్యుల ప్రమాణస్వీకారోత్సవం సంధర్భంగా కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ కూడా ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 16 మంది శాసనసభ్యులు క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా 14 మంది శాసనసభ్యులు రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తరప్రదేశ్ లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ కూటమి 273 స్థానాలు కైవసం చేసుకుని రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. యూపీకి వరుసగా రెండోసారి సీఎంగా ఎన్నికై యోగి ఆదిత్యనాథ్ చరిత్ర సృష్టించారు.

Also Read:Karnataka Hijab row: కర్ణాటకలో పదో తరగతి విద్యార్థిని బురఖా తీయించి పరీక్షకు అనుమతి ఇచ్చిన స్కూల్ యాజమాన్యం

ట్రెండింగ్ వార్తలు