Karnataka Hijab row: కర్ణాటకలో పదో తరగతి విద్యార్థిని బురఖా తీయించి పరీక్షకు అనుమతి ఇచ్చిన స్కూల్ యాజమాన్యం

హుబ్బిలి జిల్లాలో పరీక్ష రాసేందుకు బురఖా ధరించి వచ్చిన ఓ ముస్లిం విద్యార్థినిని అక్కడి స్కూల్ యాజమాన్యం అడ్డుకున్నారు.

Karnataka Hijab row: కర్ణాటకలో పదో తరగతి విద్యార్థిని బురఖా తీయించి పరీక్షకు అనుమతి ఇచ్చిన స్కూల్ యాజమాన్యం

Burqa

Karnataka Hijab row: కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉంది. విద్యాసంస్థల్లో ముస్లిం విద్యార్థినిలు బురఖా ధరించరాదని..స్కూల్ యూనిఫామ్ మాత్రమే ధరించాలంటూ ఆరాష్ట్ర హై కోర్టు స్పష్టం చేసినప్పటికీ పలు ప్రాంతాల్లో విద్యార్థినిలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఈక్రమంలో హుబ్బిలి జిల్లాలో పరీక్ష రాసేందుకు బురఖా ధరించి వచ్చిన ఓ ముస్లిం విద్యార్థినిని అక్కడి స్కూల్ యాజమాన్యం అడ్డుకున్నారు. రాష్ట్ర హై కోర్టు తీర్పుకనుగుణంగా బురఖా తీసి వస్తేనే పరీక్షకు అనుమతిస్తామని ఉపాధ్యాయులు తెగేసి చెప్పారు. అయితే విద్యార్థిని బురఖా తొలగించి సాధారణ దుస్తులతో వచ్చేవరకు సమయం కోల్పోయినా ఆమేర పరీక్షా సమయాన్ని పొడిగిస్తామని ఉపాధ్యాయులు చెప్పడంతో ఆ విద్యార్థిని బురఖా తీసేసి పరీక్షకు హాజరు అయింది. ఈ విషయంలో విద్యార్థినిపై తామేమి వివక్ష చూపలేదని కేవలం రాష్ట్ర హై కోర్టు ఆదేశాల ప్రాముఖ్యతను విద్యార్థినికి తెలియజేసి ఒప్పించామని పరీక్ష నిర్వహణాధికారి పేర్కొన్నారు.

Also Read:Bandi Sanjay On Telangana : సెంటిమెంట్ రగిలించే కుట్ర జరుగుతోంది – ఎన్నారైలతో బండి సంజయ్

కర్ణాటకలో విద్యాసంస్థలో ముస్లిం విద్యార్థినిలు బురఖా ధరించ్చడంపై హై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. చదువు కంటే ఏది ముఖ్యంకాదని.. కావునా విద్యార్థులందరూ తప్పనిసరిగా ప్రభుత్వం, పాఠశాలలు నిర్దేశించిన యూనిఫామ్ ను ధరించాలని హై కోర్ట్ స్పష్టం చేసింది. హై కోర్టు తీర్పుమేరకు కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర సైతం తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. కొన్ని అతీత శక్తులు విద్యార్థినిలను అవకాశంగా చేసుకుని అల్లకల్లోలం సృష్టించాలని చ్చుస్తున్నాయని..విద్యార్థులు ఈవిషయాన్ని గమనించి అటువంటి వారి నుండి దూరంగా ఉంటూ చదువుపై ధ్యాసపెట్టాలని జ్ఞానేంద్ర అన్నారు. హై కోర్ట్ ఆదేశాలు ధిక్కరిస్తూ బురఖాలో పరీక్షకు వచ్చే విద్యార్థినిలను ఎట్టి పరిస్థితుల్లో పరీక్షకు అనుమతించరాదని పాఠశాల, పరీక్షా కేంద్రాల నిర్వాహకులకు ఆదేశాలు జారీచేశారు.

Also read:Osmania University: ఓయూ లేడీస్ హాస్టల్ వద్ద విద్యార్థినుల ఆందోళన

ఈవ్యవహారంపై విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ సైతం స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి వివాదాలు చెలరేగకుండా పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని..విద్యార్థినిలు సాధారణ యూనిఫామ్ లోనే పరీక్షకు హాజరు కావాలని నగేష్ పేర్కొన్నారు. లేనిపక్షంలో పోలీసులు తమపని చేసుకుని పోతారని ఆయన అన్నారు. కర్ణాటక వ్యాప్తంగా మొత్తం 8.74 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షకు హాజరౌతున్నారు. ఏప్రిల్ 11 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. హిజాబ్ వివాదం నేపథ్యంలో పలు చోట్ల ముస్లిం విద్యార్థినిలు పరీక్షలను బహిష్కరించారు.

Also Read:Nitin Gadkari: కాంగ్రెస్ మళ్లీ పుంజుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను: కేంద్ర మంత్రి గడ్కరీ