'Incredible India'Bangalore-Udupi Railway Line
‘Incredible India’Bangalore-Udupi Railway Line : భారత్ లో ప్రకృతి అందాలకు కొదువ లేదు. పచ్చని తివాచీ పరచినట్లుండే చెట్లు మధ్యా, సొరంగాల కిందనుంచి, వాగులు, జలపాతాలపై రైలు, బస్సు ప్రయాణాలు..ఇలా ఎన్నో ప్రాంతాలు, ప్రయాణాలు మధురానుభూతిని కలిగే సౌకర్యాలు ఎన్నో ఉన్నాయి. విదేశాల్లోనే కాదు మనస్సుండాలే గానీ భారత్ లో అందమైన కళ్లు తిప్పుకోలేని అందాలు అన్నీ ఇన్నీ కావు. అందాల లోయలు, ఉప్పొంగే నదులు,చీకటి సొరంగాల్లోంచి రయ్ మని దూసుకుపోయే రైలు మార్గాలు ఓ మధురాను భూతుల్నికలిగిస్తాయి. భారత్ లో అటువంటి ఓ అత్యద్భుతమైన రైలు మార్గాన్ని చూసిన నార్వే రాయబారి ఎరిక్ సోల్ హీమ్ కు తెగ నచ్చేసింది.
వాహ్..ఎంత అద్భుతం ఈ రైలు మార్గం అంటూ తెగ ఫిదా అయిపోయారు. ఆ అందాల అద్భుతమైన రైలు మార్గమే ‘బెంగళూరు-ఉడుపి రైల్వై లైన్ ’..! భారత్ లో ఉన్న ఎన్నో అద్భుతమైన, అందమైన ప్రాంతాలు, రోడ్డు, రైల్వే మార్గాల్లో ఈ బెంగళూరు-ఉడుపి రైల్వై లైన్ కూడా ఒకటి.
దట్టమైన అటవీ ప్రాంతం నుంచి పాములా సాగిపోయే రైల్వే లైన్ బెంగళూరు-ఉడిపి రైల్వేలైన్. ఈ రైలులో ప్రయాణిస్తే కనుచూపు మేరలో పచ్చని చెట్లు కనిపిస్తాయి. కానీ అదే ఏరియల్ గా చూస్తే మాత్రం అత్యద్భుతంగా ఉంటుంది. ఏదైనా సరే అంతే మరి..దగ్గరనుంచి పక్కనుంచి చూస్తే కంటే పైనుంచి దూరంగా నుంచి చూస్తే అద్భుతంగా ఉంటాయి. ఈ రైల్వే లైన్ కూడా అంతే. పచ్చని దట్టమైన అడవిలోంచి దూసుకుపోయే రైల్వే లైన్ అందాలు చూడాలంటే ఏరియల్ గా చూస్తే ఆ అనుభూతే వేరు..కనురెప్పలు వాల్చటం కూడా మర్చిపోయే తదేకంగా అలా చూస్తుండిపోతాం. అంత అందంగా,అద్భుతంగా మధురానుభూతిని కలిగించేలా ఉంటుందీ రైలు మార్గం.
మరి ఇంత అద్భుతంగా ఉంటే ఎవ్వరికైనా ఎందుకు నచ్చదు. అందుకే ఉడిపి రైల్వే లైన్ నార్వే రాయబారి ఎరిక్ సోల్ హీమ్ కు తెగ నచ్చేసింది. ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్ పై పోస్ట్ చేశారు. ‘‘అద్భుతమైన భారత్. పచ్చదనం మధ్య సాగిపోయే రైల్వే లైన్ ఎక్కడైనా ఉందా? కర్ణాటకలోని బెంగళూరు-ఉడుపి రైల్వై లైన్ లో సక్లేష్ పూర్ నుంచి కుక్కే సుబ్రమణ్య వరకు’’ అంటూ పోస్ట్ పెట్టారు. ఆయనకు నచ్చిన ఈ వీడియో చూస్తే ఎవ్వరికైనా నచ్చి తీరుతుంది. ఈ రైల్వే లైన్ మార్గంలో పచ్చదనం ఒక్కటే కాదు సొరంగాలు, లోయలు, నదులు కనిపిస్తాయి అని ఓ యూజన్ తెలిపారు.
Incredible India ??!
Is there a greener rail route anywhere?
Bengaluru – Udupi Railway line, from Sakleshpur to Kukke Subramanya, Karnataka.
? IG: Rajography@VisitUdupi— Erik Solheim (@ErikSolheim) December 14, 2022