Rafale Navy Jets : రూ.63 వేల కోట్లు, 26 రాఫెల్ యుద్ధ విమానాలు.. ఫ్రాన్స్‌తో భారత్ బిగ్ డీల్..
భారతదేశ విమాన వాహక నౌకలైన INS విక్రమాదిత్య, స్వదేశీ INS విక్రాంత్ నుండి ఈ యుద్ధ విమానాలు పనిచేస్తాయి.

Rafale Navy Jets : ఫ్రాన్స్ తో భారత్ భారీ డీల్ కుదుర్చుకుంది. 63వేల కోట్ల రూపాయలతో 26 రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్ ఆమోదం తెలిపింది. రాఫెల్ జెట్ల కొనుగోలుకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరినట్లు డిఫెన్స్ వర్గాలు తెలిపాయి. ఫ్రాన్స్ నుంచి భారత నావికాదళం 22 సింగిల్-సీటర్ జెట్లతో పాటు నాలుగు ట్విన్-సీటర్ యుద్ధ విమానాలను పొందనుంది.
అంతేకాదు ఆఫ్‌సెట్ బాధ్యతల కింద ఫ్లీట్ నిర్వహణ, లాజిస్టికల్ సపోర్ట్, సిబ్బంది శిక్షణ, స్వదేశీ తయారీ భాగాల కోసం సమగ్ర ప్యాకేజీని అందుకుంటుంది. నేవీ సిబ్బందికి శిక్షణ కూడా ఈ ఒప్పందంలో భాగమే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCS) ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపింది.
Also Read : చెప్పినట్లే చేసిండు..! చైనాకు బిగ్ షాకిచ్చిన డొనాల్డ్ ట్రంప్.. 104శాతంకు సుంకాలు పెంపు..
రాఫెల్ మెరైన్ జెట్లు భారతదేశ స్వదేశీ విమాన వాహక నౌకలపై మోహరించడానికి ఉద్దేశించబడ్డాయి. సముద్రంలో నావికాదళం వైమానిక శక్తిని గణనీయంగా పెంచుతాయి. రాఫెల్ యుద్ధ విమానం.. క్యారియర్ ఆధారిత వెర్షన్ అయిన రాఫెల్ మెరైన్. దాని అధునాతన ఏవియానిక్స్, ఆయుధ వ్యవస్థలు బహుముఖ ప్రజ్ఞకు ప్రసిద్ధి.
రాఫెల్ మెరైన్ ఫైటర్ జెట్ల డెలివరీ దాదాపు నాలుగు సంవత్సరాలలో ప్రారంభమవుతాయని అంచనా. 2029 చివరి నాటికి నావికాదళం మొదటి బ్యాచ్‌ను అందుకుంటుందని, 2031 నాటికి పూర్తి విమానాలను చేర్చుకునే అవకాశం ఉందని డిఫెన్స్ వర్గాలు తెలిపాయి.
ఈ జెట్‌లు భారతదేశ విమాన వాహక నౌకలైన INS విక్రమాదిత్య, స్వదేశీ INS విక్రాంత్ నుండి పని చేస్తాయి. ఇవి పాత MiG-29K విమానాల స్థానంలో ఉంటాయి. ఈ ఒప్పందం అంతర్-ప్రభుత్వ మార్గం ద్వారా ప్రాసెస్ చేయబడుతోంది. వేగవంతమైన డెలివరీ సమయపాలనను నిర్ధారిస్తుంది. ఫ్రెంచ్ తయారీదారు డస్సాల్ట్ ఏవియేషన్ నిర్వహణ మద్దతు ఇస్తుంది.
హిందూ మహా సముద్రంలో చైనా ఉనికి పెరుగుతున్న నేపథ్యంలో భారత్ అలర్ట్ అయింది. సముద్రంలో గస్తీ పెంచడానికి, శత్రు దేశాల నుంచి ముప్పును ఎదుర్కోనేందుకు రాఫెల్ ఎం జెట్ విమానాలు ఉపయోగపడనున్నాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
Also Read : సరికొత్త ఆధార్ యాప్ వచ్చేసింది.. దీనివల్ల ఉపయోగాలు ఏమిటంటే..? ఇక ఆధార్ కార్డుతో పనిలేదు..
రాఫెల్ M అనేది క్యారియర్ ఆధారిత మిషన్ల కోసం రూపొందించబడింది. రీ ఇన్ ఫోర్డ్స్ ల్యాండింగ్ గేర్, అరెస్టర్ హుక్స్, షార్ట్ టేక్-ఆఫ్ ఆపరేషన్లను అమలు చేయడానికి బలోపేతం చేయబడిన ఎయిర్‌ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది.
రాఫెల్-M ఒప్పందంతో పాటు, ప్రాజెక్ట్-75 కింద మూడు అదనపు స్కార్పీన్-క్లాస్ జలాంతర్గాముల నిర్మాణంతో భారతదేశం తన నీటి అడుగున పోరాట సామర్థ్యాలను బలోపేతం చేయనుంది. ఈ జలాంతర్గాములను మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (MDL), ఫ్రాన్స్ నావల్ గ్రూప్‌తో భాగస్వామ్యంలో నిర్మించనున్నారు.